వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే సంతోషించేవాడిని: మాణిక్యాలరావు రాజీనామాపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: భారతీయ జనతా పార్టీ నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్య రావు రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు తీవ్రంగా స్పందించారు. ఆయన రాజకీయం కోసం రాజీనామా చేశారని ఆరోపించారు.

చంద్రబాబు మూడ్రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మంగళవారం మూడో శ్వేతపత్రం విడుదల సందర్భంగా విలేకరులు... మాణిక్యాల రావు రాజీనామాపై ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించారు. మాణిక్యాల రాజీనామాను ఆయన తప్పుబట్టారు.

అలా రాజీనామా చేస్తే సంతోషించేవాడిని

అలా రాజీనామా చేస్తే సంతోషించేవాడిని

పోలవరం నిధుల కోసం మాణిక్యాల రావు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉంటే సంతోషించేవాడినని చంద్రబాబు చెప్పారు. కానీ రాజకీయ కోణంలో ఆయన రాజీనామా చేశాడని వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తుంటే మాణిక్యాలరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీకి వెళ్లి దీక్ష, పోరాటం చేయాలి

ఢిల్లీకి వెళ్లి దీక్ష, పోరాటం చేయాలి

తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఎప్పుడైనా ఏపీ చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మాణిక్యాలరావు దీక్ష చేయాల్సి వస్తే ఢిల్లీకి వెళ్లి చేయాలన్నారు. కేంద్రంపై ఆయన పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఎన్డీయే కాదా? అన్నారు.

56 హామీలు నెరవేర్చలేదు

56 హామీలు నెరవేర్చలేదు

కాగా, మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే రాజీనామా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నానని, పదిహేను రోజుల్లోగా సీఎం చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు.

మూడు నెలలుగా చంద్రబాబు చుట్టు తిరుగుతున్నా

మూడు నెలలుగా చంద్రబాబు చుట్టు తిరుగుతున్నా

తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై మూడు నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పదిహేను రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతానని, చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నానని, ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని, తాడేపల్లిగూడెంలో మీ టీడీపీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని భావిస్తున్నానని, తనను తొలగించి అయినా సరే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని, తన రాజీనామాను మీరే స్పీకర్‌కు పంపించాలని చంద్రబాబుకు సూచించారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu responded on BJP leader Pydikondala Manikyala Rao resignation on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X