గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు, సెక్యూరిటీ లేకుండా చిన్న పరిశ్రమలకు లోన్లు
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 900 కోట్ల రూపాయల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 100 కోట్ల రూపాయలు విధులతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా ( ఎంఎస్ఎంఈ) రుణాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న చిన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధులు ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్షనిర్వహించారు.

ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి త్వరలోనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారి కోసం ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎంఈ వన్ యాప్ ను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు.
చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్ఎంఈల చొప్పునా 50 పారిశ్రామిక పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏపీఐఐసీ నిధులతో పార్కులను అభివృద్ధి చేయడం వలన వాటి భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. భూముల ధరలు ఎక్కువగా ఉండటం వలన చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఆ పరిశ్రమల యజమానులకు ఇబ్బందిగా మారింది.

ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలో రెండు చొప్పున మరో 50 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం అమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఏపీఐఐసీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్ పార్కులు ఏర్పాటు చేయడానికి భూసేకరణ కోసం రంగంలోకి దిగింది.
చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇప్పటికే ఏపీఐఐసీ భూసేకరణ చేపట్టింది. చిన్న పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహిస్తే నిరుద్యోగ సంస్థను తగ్గించడానికి అవకాశం ఉంటుందని, చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఎక్కువ మంది వ్యాపారవేత్తలు వస్తారని కూటమి ప్రభుత్వం అంటోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్తగా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయడానికి చకచకా చర్యలు తీసుకుంటున్నది.












Click it and Unblock the Notifications