కలెక్టర్ల మధ్య పోటీ, మీరు మారరా: బాబు, హైదరాబాద్ కంటే ఎక్కువైతే ఎవరొస్తారు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..

శాఖల వారీగా పురోగతిపై ఎప్పుటికప్పుడు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. కలెక్టర్ల మధ్య పోటీ పెడతామని తెలిపారు. శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ఎన్నిసార్లు చెప్పినా మారరా?

ఎన్నిసార్లు చెప్పినా మారరా?

ఎన్నిసార్లు చెప్పినా పని తీరు మార్చుకోవడం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ పనితీరు కూడా రోజు రోజుకు తీసికట్టుగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ కంటే ఎక్కువ ధర అంటే ఎవరు వస్తారు

హైదరాబాద్ కంటే ఎక్కువ ధర అంటే ఎవరు వస్తారు

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన వారికి ఏపీఐఐసీ హైదరాబాద్‌లో కూడా లేని విధంగా భూముల ధరలు చెబుతోందని, అలా అయితే ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారని చంద్రబాబు నిలదీశారు.

నేనే రేవులో కూర్చుంటా

నేనే రేవులో కూర్చుంటా

ఇసుక ధరల్ని 10-15 రోజుల్లో పూర్తిగా నియంత్రణలోకి తేవాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు చేయలేకపోతే నేనే స్వయంగా రేవులో కూర్చుని ధరలు నియంత్రిస్తానని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నా కూడా దందాలు కొనసాగడం, వినియోగదారులు ఎక్కువ ధర పెట్టి కొనాల్సి రావడం, పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తుండటంపై మండిపడ్డారు.

మారువేషంలో వెళ్లండి

మారువేషంలో వెళ్లండి

మంత్రులు, అధికారులు స్వయంగా రీచ్‌లకు వెళ్లి పరిస్థితి సమీక్షించాలని చంద్రబాబు అన్నారు. ధరలు నియంత్రణలో ఉన్నా కూడా, పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తే సంబంధిత మీడియా ప్రతినిధుల్ని తీసుకువెళ్లి చూపించాలన్నారు. మీరు మారు వేషంలో వెళ్తారో, ఎలా వెళతారో తనకు తెలియదని, మీరు కూడా వెళ్లి చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరి వల్ల కాదంటే నేనే వెళ్తానన్నారు. అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ పెట్టాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Saturday said that he will give ranks to ministers and officers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X