హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్రలేవడం నేర్పింది ఎన్టీఆరే!: చంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాదీలకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పింది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు దివంగత ఎన్టీఆరేనట. ఈ విషయంపై ఏపీ సీఎం, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాజమండ్రిలో ఆసక్తికర ప్రకటన చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు 24 గంటలు పనిచేస్తున్నారు' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ వాసులు ఇంకా బాగా పనిచేయాలన్నారు. ‘శారీరక కష్టం అవసరంలేదు. మెదడుకు పదును పెడితే చాలు' అని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో విజయవాడ ప్రాముఖ్యం ఏమీ తగ్గబోదని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజధాని అమరావతితో పాటు గుంటూరు, తెనాలి, మంగళగిరి లాంటి నగరాలు, పట్టణాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్భాగంగా ఉంటాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో గుడివాడ, సత్తెనపల్లి తదితర ప్రాంతాలూ భాగంగానే ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications