ఎలా తీసుకెళ్తారో చూస్తాను: మోడీపై బాబు, ఫేస్‌బుక్‌పై ఆరా

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్ నుంచి వెలికి తీస్తున్న సహజవాయువును తొలుత మన రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని, ఆ తర్వాతే బయటకు తీసుకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఉద్దేశించి మంగళవారం నాడు వ్యాఖ్యానించారు.

ఏపీ కేబినెట్ సమావేశమై చంద్రబాబు ప్రత్యేక హోదా, కేజీ బేసిన్ గ్యాస్, కృష్ణా పుష్కరాలు తదితర అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజీ బేసిన్ విషయమై మాట్లాడుతూ.. మనకు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు.

ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ యూనిట్టు, ఎరువుల కర్మాగారాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రస్తావించానన్నారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అంశంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాను అన్ని పార్టీలు బాధ్యతగా తీసుకోవాలన్నారు.

పుష్కరాలు

పుష్కరాలు

గతేడాది గోదావరి పుష్కరాల కోసం వందకోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం ఈసారి పైసా కూడా విదిలించకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పుష్కరాలు

పుష్కరాలు

గతేడాది గోదావరి పుష్కరాల కోసం వందకోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం ఈసారి పైసా కూడా విదిలించకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

కేబినెట్ మీటింగులో మంత్రుల ఫేస్‌బుక్ ఖాతాలపైనా చర్చ జరిగింది. ఎంతమందికి ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయన్న చంద్రబాబు ప్రశ్నకు తామందరికీ ఉన్నాయని మంత్రులు బదులిచ్చారు. ఎంతమంది రోజూ వాటిని అప్‌డేట్ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

తాము రోజూ పోస్టింగులు చేస్తున్నట్టు గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు 70వేల మంది ఫాలోవర్లు ఉన్నారని గంటా చెప్పగా, 50 వేలమంది తన ఖాతాను అనుసరిస్తున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు మరింత చేరువయ్యేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister N Chandrababu Naidu on Tuesday said it was the responsibility of all political parties in Parliament to undo the injustice done to Andhra Pradesh in the matter of its bifurcation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి