వాళ్ళు అధికారంలోకి వస్తే దయ్యాలకు ఫించన్: బాబు సంచలనం

ఒకప్పుడు దయ్యాలు కూడ ఫించన్లు తీసుకొనేవి..అదీ కాంగ్రెస్ పాలన ప్రభావం. మన పాలనలో దయ్యాలు లేవు. అయితే మళ్ళీ ఆ దుర్మార్గులు వస్తే మాత్రం మళ్ళీ దయ్యాలు వస్తాయని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు సంచలనవ్యాఖ్యలు చేశ

అనంతపురం: ఒకప్పుడు దయ్యాలు కూడ ఫించన్లు తీసుకొనేవి..అదీ కాంగ్రెస్ పాలన ప్రభావం. మన పాలనలో దయ్యాలు లేవు. అయితే మళ్ళీ ఆ దుర్మార్గులు వస్తే మాత్రం మళ్ళీ దయ్యాలు వస్తాయని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు సంచలనవ్యాఖ్యలు చేశారు.

మీ దగ్గర నుండి నేను కోరుకొనేది ఒక్కటే నాకు పూర్తి సహకారమన్నారాయన. బుదవారం నాడు అనంతపురం జిల్లా ముక్తాపూర్ లో జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి లబ్దిదారుడు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు.

Chandrababu naidu sensational comments on Congress leaders

అయితే ఇందులో అక్రమాలుచోటుచేసుకోకుండా ఆధార్ కార్డును కూడ అనుసంధానం చేశామన్నారు. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టే అవకాశమే లేదన్నారు.

డ్వాక్రా మహిళలకు, వృద్దులకు ఫించన్లు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లబ్దిదారుడికే నేరుగా డబ్బులు అందేలా చర్యలు తీసుకొన్నామన్నారు. గర్బిణీలకు ఎన్టీఆర్ కిట్, బసవతారకం కిట్ లను అందిస్తున్నట్టు చెప్పారు.

ఎవరైనా చనిపోతే మహప్రస్థానం పేరుతో వాహనాన్ని సమకూర్చి అంత్యక్రియలకు కూడ సహయాన్ని అందిస్తున్నట్టు చెరప్పారు. అన్నింటిని ఉపయోగించుకొంటూ అభిృద్దిలో భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+