వైసీపీతో కాదు, స్వంతపార్టీ నేతలతోనే చిక్కులు: బాబు సంచలనం

వైసీపీ వల్ల ఇబ్బందులు లేవు. స్వంత పార్టీకి చెందిన నాయకుల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు తమ పద్దతిని మార్చుకోవాలని ఆయన సూచించారు.

అమరావతి: వైసీపీ వల్ల ఇబ్బందులు లేవు. స్వంత పార్టీకి చెందిన నాయకుల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు తమ పద్దతిని మార్చుకోవాలని ఆయన సూచించారు.

పార్టీ సమన్వయకమిటీ సమావేశం అమరావతిలో సోమవారం నాడు జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

నంద్యాలలో చోటుచేసుకొంటున్న పరిణామాలతో పాటు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్నఅభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

పార్టీ నియమావళికి విరుద్దంగా వ్యవహరించే నేతలపై చర్యలపై చర్యలు తీసుకొంటామని బాబు హెచ్చరించారు. పార్టీపై, ప్రభుత్వంపై జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సమన్వయకమిటీ సమావేశంలో నేతలకు సూచించారు.

వైసీపీతో కాదు, స్వంతపార్టీ నేతలతోనే ఇబ్బందులు

వైసీపీతో కాదు, స్వంతపార్టీ నేతలతోనే ఇబ్బందులు

స్వంత పార్టీ నేతల వైఖరి కారణంగానే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు జరిగిన పార్టీ సమావేశంలో కొందరు నేతల వైఖరి తీరును బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీతో నష్టమే లేదన్నారు. వైసీపీ బలహీనపడిందన్నారు. ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉందని బాబు అభిప్రాయపడ్డారు.కానీ, పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీకి కలిసివస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పద్దతి మానుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

నంద్యాలలో గెలిచి తీరాలి

నంద్యాలలో గెలిచి తీరాలి

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరాల్సిందేనని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబంలో ఒకరిగి ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైసీపీ తుంగలో తొక్కిందని బాబు విమర్శించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుందని చెప్పారు. మంత్రులు కాలువ శ్రీనివాసులు, నారాయణ, కేంద్రమంత్రి సుజానా చౌదరిలకు బాధ్యతలను అప్పగించారు.ఈ ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించాల్సిందేనన్నారు.

40 శాతం ప్రజలు సంతృప్తి చెందాలి

40 శాతం ప్రజలు సంతృప్తి చెందాలి

రాష్ట్రంలో 47 శాతం ఓటర్లు తృప్తిగా ఉండడం కాదు, 40 శాతం ప్రజలంతా టిడిపి వైపు రావాలి, వారంతా సంతృప్తితో ఉండాల్సిన అవసరం ఉందని బాబు పార్టీ నాయకులతో అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకొంటానని చెప్పారు. బూత్ కమిటీల నియామకాన్ని జూలై చివరినాటికి పూర్తి చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులతో పాటు ఇన్ చార్జ్ లుగా నలుగురు నాయకులను నియమించాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు. నెగెటివ్ వార్తలపై దృష్టిపెట్టాలని బాబు మంత్రులకు సూచించారు. సెప్టెంబర్ 1వ, తేది నుండి 60 రోజుల పాటు ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

గుంటూరు నేతల తీరుపై బాబు ఆగ్రహం

గుంటూరు నేతల తీరుపై బాబు ఆగ్రహం

గుంటూరు జిల్లా నేతలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించిన సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గైరాజర్ కావడంపై ఆయన మండిపడ్డారు. జిల్లా ఇంచార్జీ మంత్రి నిర్వహించిన సమావేశానికి ఎందుకు గైరాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాబు పార్టీ నాయకులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+