చంద్రబాబూ! ఇందుకేనా.. క్షమాపణ చెప్పు: పవన్ కళ్యాణ్, లాయర్లతో భేటీ
Recommended Video

హైదరాబాద్/అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడవాళ్లను అవమానించేందుకేనా చంద్రబాబుకు ఓటు వేసింది అని గట్టిగా నిలదీశారు. మహిళలకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం (20-04-2018) సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని పవన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఫిల్మ్ చాంబర్లో మూడు గంటలు, లాయర్లతో భేటీ
పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్లో మూడు గంటల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. పవన్ ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నంద సేపు అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. అక్కడ న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు.
కాగా, అంతకుముందు కూడా పవన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన దీక్షలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కు ఆహ్వానం పంపారట. ఈ విషయాన్ని పవన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
'ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కిమిడి కళా వెంకట్రావు గారి దగ్గరి నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు. అందులో మీరు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో రాష్ట్రం మేలు కోసం నన్ను పాల్గొనాల్సిందిగా కోరారు. అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఏమీ ఆశించకుండా మీ తెలుగు దేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ.. మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనక నుంచి మీడియా శక్తుల ద్వారా చంపేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?' అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications