వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా, యువభేరీలా: జగన్‌పై బాబు పైర్

వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా యువభేరీ సదస్సులా అని బాబు ప్రశ్నించారుకృష్ణా జిల్లాలో టిడిపి కార్యాలయం లేకపోవడంపై బాబు మంత్రి దేవినేనిపై అసంతృప్తి వ్యక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విమర్శలు గుప్పించారు.ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా యువభేరీలు ఎందుకని ప్రశ్నించారు.

తొందరపడ్డారు:కెసిఆర్-పయ్యావుల రహస్య భేటీపై బాబు సీరియస్తొందరపడ్డారు:కెసిఆర్-పయ్యావుల రహస్య భేటీపై బాబు సీరియస్

మంగళవారం అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతపురంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని జగన్ పదే పదే ప్రకటించారు.

అయితే ఎంపీలతో రాజీనామా చేయించకుండా పదే పదే ప్రకటనలు చేయడంపై బాబు విమర్శలు గుప్పించారు. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆపార్టీ చూసుకుంటుందని బాబు చెప్పారు. స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. అసంతృప్తులను కలుపుకొని వెళ్లాలని చెప్పారు.

chandrababu naidu slams on Ysrcp chief Ys Jagan

మరోవైపు ఇద్దరు మంత్రులున్న జిల్లాలో పార్టీ కార్యాలయం లేక.పోవడంపై చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో పార్టీ కార్యాలయం లేకపోవడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

నదులకు హారతులు ఇచ్చి మహాసంకల్పం చేసినందునే ...రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత అనంతపురం జిల్లాలో వరదలు వచ్చాయని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కావాలనే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ముద్రగడను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేకహోదాపై జగన్‌ గందరగోళంలో ఉన్నారు

ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ అధినేత జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని రాష్ట్ర మంత్రి జవహర్ అన్నారు. రాజీనామాలంటే జగన్‌కు భయం అని, అందుకే ఎంపీలతో రాజీనామా చేయించడంలేదని ఎద్దేవా చేశారు.

ఎంపీల రాజీనామా అంశంలో జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా మరో 20 ఏళ్లు టీడీపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు సీఎం పదవి అందని ద్రాక్షే అని అన్నారు. బైబిల్‌ నమ్ముతాననే జగన్‌.. మరో వైపు చిన్నజీయర్‌ కాళ్ళు పట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారు? అని ప్రశ్నించారు.

English summary
Ap chief minister Chandrababu naidu made allegations on Ysrcp chief ys Jagan on Tuesday. Why Ysrcp MP's didn't resignations asked chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X