ఏం మాటలవి, ఏం ఆలోచించి అలా మాట్లాడుతున్నారు: జగన్‌పై బాబు
రాజకీయాల్లో హుందాతనం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంద్యాల: రాజకీయాల్లో హుందాతనం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాంటి మాటలా
ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులుగా యువతకు మంచి సందేశం ఇవ్వాలి గానీ.. నిన్ను కాల్చేస్తా.. నిన్ను ఉరేస్తా.. నిన్ను బట్టలూడదీస్తా.. అని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

ఏం ఆలోచించి అలా మాట్లాడుతున్నారు
అసలు మనం ఎక్కడికి పోతున్నామని, ఏం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నారని చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏం చేసినా హుందాగా వ్యవహరించాలని సూచించారు.
Recommended Video


తప్పకుండా విమర్శించు కానీ
విమర్శించాలని, తప్పుచేస్తే తప్పకుండా విమర్శించాలని, దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ విమర్శలకు ఓ అర్థం పర్థం ఉండాలని చంద్రబాబు హితవు పలికారు.

వైసిపి కార్యకర్తకు గాయాలు
ఇదిలా ఉండగా, నంద్యాలలో టిడిపి - వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైసిపి కార్యకర్తకు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications