వెధవ పనిచేసి, సిగ్గులేకుండా..: జగన్ ఉదాసీనతే కారణమంటూ ‘గోరంట్ల’పై చంద్రబాబు
అమరావతి: ఏపీలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపుతోంది. ఆ ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, ఆ తర్వాతే చర్యలుంటాయని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

వెధవ పనిచేసి, సిగ్గులేకుండా..: గోరంట్లపై చంద్రబాబు
ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శల యుద్ధంగా జరుగుతోంది. కాగా, తాజాగా, గోరంట్ల న్యూడ్ వీడియో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ‘ఓ వెధవ పనిచేసి ఎవ్వరూ బహిరంగంగా తిరగలేరు.. కానీ, సిగ్గులేని వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కుల మతాలను అడ్డుపెట్టుకుంటారు అని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే.: జగన్‌పై చంద్రబాబు ఫైర్
అంతేగాక, ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే.. చూస్తూ ఉండాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు.. తప్పు చేసినవారిని మందలించి, దండిస్తే.. మిగిలినవాళ్లకు భయం ఉంటుందన్నారు చంద్రబాబు. అయితే, జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు, భూకబ్జాలు వంటివి పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి అంటూ బాబు ఫైర్
రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో తయారైందని, సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ అన్యాయాలను, దారుణాలను ప్రశ్నిస్తే.. సాక్షిలో గుమస్తాగా పనిచేసే వ్యక్తి కూడా తన గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికలోనూ గెలవలేని ఆ గుమస్తా.. ఏడు ఎన్నికల్లో గెలిచిన తన గురించి మాట్లాడతారా? అని చంద్రబాబు నిలదీశారు.
Recommended Video


‘గోరంట్ల' వీడియో నిజమని తేలితే చర్యలు: హోంమంత్రి వనిత
మరోవైపు, గోరంట్లకు సంబంధించినదని వైరల్ అయిన వీడియో వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ మాధవ్ కు చెందినదిగా చెబుతున్న వీడియోలో.. రాజకీయ కుట్ర ఉందని అనుమానం కలుగుతోందని వనిత అన్నారు. ఇదే విషయాన్ని మాధవ్ కూడా చెప్పారన్నారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని.. ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే, మాధవ్‌కు సంబంధించినది చెబుతున్న వీడియో.. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ విచారణలో ఉందని తెలిపారు. నిపుణులు పర్యవేక్షిస్తున్నారని.. త్వరలోనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని చెప్పారు. ఆ వీడియో నిజమైనదే అని తేలితే.. తప్పకుండా శిక్ష పడుతుందన్నారు.
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి వనిత అన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీ మాధవ్ ను ప్రభుత్వం రక్షించాలని చూస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హోంమంత్రి తానేటి వనతి.












Click it and Unblock the Notifications