వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు దర్యాఫ్తు చేసిన అధికారి ఇప్పుడు ఏపీలో తిరుగుతున్నారు, ఆయన చెప్తారు: లక్ష్మీనారాయణపై బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మా జోలికొస్తే.. ఖబడ్దార్!: మోడీకి బాబు తీవ్ర హెచ్చరిక

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసును దర్యాఫ్తు చేసిన అధికారి ఇప్పుడు ఏపీలో తిరుగుతున్నారని, రైతులకు న్యాయం చేయడం కోసం తిరుగుతున్నారని, ఆయన చెబుతారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. జగన్ అక్రమాస్తుల అంశం వచ్చినప్పుడు బాబు పైవిధంగా మాట్లాడారు.

నా క్యారెక్టర్‌ను వేలెత్తి చూపించే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. తాను నలభై ఏళ్ల నుంచి ఎంతో క్రమశిక్షణతో, విశ్వసనీయతతో ఉన్నానని చెప్పారు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని, ఎక్కడా చిన్న తప్పు జరగకూడదని భావిస్తూ ముందుకు వెళుతున్నానని తెలిపారు. నలభై ఏళ్లుగా తనపై చాలామంది ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్క ఆరోపణని కూడా నిరూపించలేకపోయారన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలు, శ్రమవల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పి, దుమ్ముదులిపిన చంద్రబాబుపవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పి, దుమ్ముదులిపిన చంద్రబాబు

Chandrababu Naidu speech in Mahanadu: AP CM names CBI former JD name

తాము అధికారం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశామన్నారు. తాము పదవుల కోసం ఎన్డీఏలో చేరలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేరామని, కానీ కేంద్రం మాట నిలబెట్టుకోలేదన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు.

చంద్రబాబు మహానాడు ముగింపు ప్రసంగం అనంతరం జై తెలుగుదేశం అని, ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అని నినదించారు. కార్యకర్తలతో కూడా నినాదం చేయించారు. ఆ తర్వాత నమ్మకద్రోహం, కుట్ర, రాజకీయాలపై పోరాడుదామని నినాదం చేశారు. పనికిమాలిన రాజకీయాలు చేసేవారు ద్రోహులుగా మిగిలిపోతారని చంద్రబాబు చివరగా మండిపడ్డారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu lashed out at Jana Sena chief Pawan Kalyan, YSR Congress Party chief YS Jagan Mohan Reddy and NDA government in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X