హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత దేశానికి ఏపీ గేట్ వే, పీవీ సంస్కరణ వల్లే: సీఎం చంద్రబాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మూడవ రోజు నిర్వహిస్తున్న ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరులు, పెట్టుబడి అవకాశాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

 Chandrababu Naidu speech in pravasi bharatiya divas 2015

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గేట్ వే అని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణల వల్లే దేశానికి గుర్తింపు లభించిందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్ధానంలో నిలుస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీరు, గ్యాస్, రోడ్లు, విద్యుత్, ఫైబర్ గ్రిడ్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామాన్ని కూడా స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ డెస్క్ విధానాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

భూముల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతామని, వచ్చే నెల నుంచి ఈ-బిజ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సుందర నగరమైన విశాఖలో మెగా ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు దేశవ్యాప్తంగా 10 మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయమే గుజరాత్‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గుజరాత్‌ మంత్రులు సీఎం చంద్రబాబుకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు.

చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సీఎంలో సతీష్‌చంద్ర, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అజయ్‌జైన్‌, రాష్ట్ర ప్రణాళికా కమిటీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఉన్నారు.

English summary
Andhra Pradesh Cheif Minister Chandrababu Naidu speech in pravasi bharatiya divas 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X