విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చివరి రక్తం బొట్టు వరకు పోరాడతా: తెలంగాణాకు చంద్రబాబు కితాబు

తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. టీడీపీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా పార్టీకి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

'మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెదేపా. హుద్‌హుద్‌ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది' అని చంద్రబాబు తెలిపారు.

chandrababu naidu speech in Visakhapatnam mahanadu

'మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెదేపా. హుద్‌హుద్‌ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది' అని చంద్రబాబు తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పునర్‌ అంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యకు ప్రాధాన్యమిచ్చిందని అన్నారు.

ఫలితంగా నేడు తెలుగురాష్ట్రాలు దేశంలో విద్యాపరంగా ముందంజలో ఉన్నాయన్నారు. రాయలసీమ, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రాధాన్యమిచ్చిందని అన్నారు. నేటి హైదరాబాద్‌కు వస్తున్న ఆదాయం నాడు టీడీపీ వేసిన పునాది కారణంగానే లభిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు.
జీవితంలో మనం చేసిన పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు.

విశాఖ సుందరనగరమని, 2015లో హుధుద్‌ను తట్టుకుని నిలబడిందని అన్నారు. దేశంలో 3వ సుందరనగరంగా విశాఖ ఉందని తెలిపారు. మహనాడు వేదిక బాగుందని, ఓ పక్క హైటె సిటీ, మరో పక్క పోలవరం నమూనాలు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. హైటెక్ సిటీ తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపిందని, పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి అని అన్నారు. ఏపీ ప్రజలు గర్వపడే విధంగా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

ప్రజల సేవే పరమావధిగా నిరంతరం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ వారికి అండగా నిలుస్తూ వారి కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజలే ముందు అని ఆ తర్వాతే కార్యకర్తలు, నాయకులని అన్నారు.

హైదరాబాద్‌లో టీడీపీ మహానాడులో పాల్గొన్నానని, రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పటి కంటే ఎక్కువ స్పందన కనిపించిందని చంద్రబాబు అన్నారు. ఇందుకు తెలంగాణ కమిటీకి అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే మనం నిరంతరం గుర్తుండిపోతామని అన్నారు. తెలుగువారి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. మహానాడులో తీర్మానం కూడా చేస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మీద పోరాటం చేసి విజయం సాధించారని, అంతేగాక, ఒక ప్రాంతీయ పార్టీని పార్లమెంటులో ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు.

ఉన్నత విద్యలో తెలంగాణ, ఏపీలు ముందున్నాయని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కోసం విదేశాలు తిరిగానని, సైబరాబాద్ ఏర్పాటు కృషి చేశానని చెప్పారు. హైదరాబాద్ ఆదాయానికి తాము వేసిన పునాదే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తెలంగాణ, ఏపీల్లో తన మీద ఉన్న ప్రజల అభిమానం ఏ మాత్రం తగ్గలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీతోపాటు తెలంగాణ కూడా ముందుండటం మంచి పరిణామమని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.

English summary
Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu speech in Visakhapatnam mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X