జపాన్ తరహా నిరసన, ఇంకేదో చేస్తామని బెదిరింపు: చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: రాష్ట్ర విభజన వల్ల తీవ్ర నష్టం జరిగిందని, ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సాయం అడిగితే మన రాష్ట్రం మీద ఎదురుదాడి చేస్తున్నారని, ఇంకా ఏదో చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.
చదవండి: 'మోడీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు, మాట్లాడవచ్చు కదా, బీజేపీకి అనుకూలంగా'
నాలుగేళ్లుగా విభజన హామీల కోసం ప్రయత్నాలు చేశామని చెప్పారు. కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపి, సాయం కోరినా చేయలేదన్నారు. న్యాయం చేయమని అడగడం తప్పా అని నిలదీశారు.
చదవండి: అప్పుడేం చేశావ్: చిరంజీవి-పవన్ కళ్యాణ్‌పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

గొంతెమ్మ కోరికలు కాదు
చంద్రబాబు అమరావతిలోని ఉండవల్లిలో మహిళా సాధికార మిత్రులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఏపీకి ఎంతకీ సాయం చేయకపోవడంతో ఇక కేంద్రం నుంచి వైదొలగాలని సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులకు చెప్పానని అన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు.

అందుకే వైదొలిగాం
ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగామని చంద్రబాబు అన్నారు. ఎంత అడిగినా సాయం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఎన్డీయే నుంచి వైదొలిగి అవిశ్వాస తీర్మానం పెట్టామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందేవరకు తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అందుకే జపాన్ తరహాలో ప్రతిరోజు అర్ధగంట నిరసన చేద్దామన్నారు.

జపాన్ తరహా నిరసన
ఉద్యోగులు అందరు కూడా తమ కార్యాలయాల్లో గంటసేపు ఎక్కువ పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అవసరమైతే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలుపుదామన్నారు. నిరసనల్లో భాగంగా నిరాహార దీక్షలు కూడా చేద్దామన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సహా ఎవరు ఆందోళన చేపట్టినా మద్దతిస్తామన్నారు.












Click it and Unblock the Notifications