ఎంపీలకు చంద్రబాబు సలహా ఇదీ: తీరు అదేనా అంటూ రోజా
విజయవాడ: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ పార్లమెంటు సభ్యులు చేయాల్సిన ఆందోళన రూపంపై దుబాయ్ నుంచే సలహా ఇస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో జరుగుతున్న పరిణామాలను ఆయన పరిశీలిస్తున్నారు.
Recommended Video

టిడీపి పార్లమెంటు సభ్యులతో ఆయన గురువారం దుబాయ్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం చేయనున్న నేపథ్యంలో ఏ విధమైన నిరసన వ్యక్తం చేయాలనే విషయాన్ని సూచించారు.

ఇలా చేయాలని చంద్రబాబు సూచన
లోకసభలో అరుణ్ జైట్లీ ప్రసంగం చేస్తున్న సమయంలో నినాదాలు చేయవద్దని, వెల్‌లో నించుని ప్లకార్డులు ప్రదర్శించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. జైట్లీ ప్రసంగంలో ప్యాకేజీ ప్రస్తావన లేకపోతే మాత్రం నిరసన కొనసాగించాలని ఆయన చెప్పారు.

టిడిపి ఎంపీలను నమ్మే స్థితిలో లేరు...
పార్లమెంటులో టిడిపి ఎంపీలు చేస్తున్న ఆందోళనను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ కేంద్ర మంత్రులతో చంద్రబాబు రాజీనాాలు చేయించి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని ఆమె సూచించారు.

ఇప్పుడు వారు కొత్తగా వచ్చి...
ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు కర్మాగారం కోసం తమ పార్టీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని రోజా గుర్తు చేశారు. ఇప్పుడేమోకొత్తగా వచ్చి పోరాటాలు చేస్తామంటే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని ఆమె అన్నారు.

అన్ని హామీలు నెరవేరుస్తాం..
టిడిపి మిత్రపక్షంగా బిజెపి కేంద్రానికి ఎంతో చేసిందని మంత్రి, బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాసరావు చెప్పారు. ఎపికి ఇచ్చిన హామీలను అన్నింటిని కేంద్రం నెరవేరుస్తుందని ఆయన గురువారం చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం సంతృప్తికరమైన సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఎపికి ఏం చేసిందో చెప్తాం
అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో రేపు శుక్రవారం చెబుతామని బిజెపి పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు చెప్పారు ఎపికి న్యాయం జరగలేదని అనడం సరి కాదని ఆయన గురువారం అన్నారు. విడతలవారీగా కేంద్రం సాయం చేస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా బిజెపి ఎపికి సాయం చేస్తోందని చెప్పారు. ఎపికి ఇచ్చిన హామీల అమలుపై తమ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతామని అన్నారు.












Click it and Unblock the Notifications