నారా చంద్రబాబు నాయుడు అనే నేను... పీఎం మోడీ సమక్షంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి లో ఏర్పాటు చేసిన వేదిక పైన కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిఐపిలు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
వేదికపై చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో ప్రమాణస్వీకారం చేయించారు.. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ.. ఆయన చెప్పగానే ప్రజలంతా జయజయ ధ్వానాలు చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో పనిచేస్తానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని, నా కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేశారు.

Chandrababu naidu taken oath as chief minister

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. సంతోషంలో అభిమాన గణం
భయంగాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వేదిక పైన చంద్రబాబు నాయుడు.. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే క్షణం కోసం ఎదురు చూసిన అభిమానుల కోరిక తీరింది. సభా ప్రాంగణం అంతా సంతోషంతో కూడిన కేరింతలతో మారుమోగిపోయింది.

ప్రధాని మోడీతో పాటు అతిరథ మహారధుల సమక్షంలో చంద్రబాబు ప్రమాణం
భారత ప్రధాని నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు ఇతర రంగాల అతిరథ మహారధులు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత తదితరులు ఉన్నారు. అందరి సమక్షంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కళ్ళలో ఆనందం కనిపించింది, ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తానని చంద్రబాబు ప్రమాణం చేశారు.

ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం.. దేశం యావత్తు తిలకించిన ఆసక్తికర ఘట్టం
అంతకు ముందు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, మరో 24 మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఘట్టం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశం యావత్తు ఆసక్తిగా తిలకిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+