బాబుది వ్యూహాత్మక తప్పిదం, అసమర్ధతకు నిదర్శనం: బిజెపి
అమరావతి: ఎన్డీఏ నుండి టిడిపి బయటకు రావడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యూహత్మక తప్పిదంగా బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహరావు విమర్శించారు.
బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి జీవిఎల్ నరసింహరావు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోతామని టిడిపికి భయం పట్టుకొందని జీవిఎల్ నరసింహరావు అభిప్రాయపడ్డారు. ఈ భయంతోనే ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిందన్నారు.

ఏపీ రాష్ట్రంలో తాము బలపడేందుకు ఇదే సరైన అవకాశమని జీవిఎల్ నరసింహరావు చెప్పారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని జీవిఎల్ నరసింహరావు అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో కూటమి ఏర్పాటు అవుతోందని తాను భావించడం లేదని జీవిఎల్ నరసింహరావు చెప్పారు.29 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం రాష్ట్రానికి ఏ మాత్రం సహయం చేయడం లేదని చంద్రబాబునాయుడు చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనంగా చెప్పారు.












Click it and Unblock the Notifications