ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హులు: రాహుల్ గాంధీతో రఘువీరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు నారా చంద్రబాబు నాయుడు అనర్హులు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు నారా చంద్రబాబు నాయుడు అనర్హులు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీని కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలను రాహుల్ గాంధీ అభినందించారని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు.

జన్మభూమి నిర్వహణ, తెలుగుదేశం వ్యవహార శైలిపై గవర్నర్‌కు లేఖ రాశామన్నారు. జన్మభూమి కార్యక్రమం ఆధిపత్య పోరుకు వేదికగా మారిందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించినవి శూన్యం అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అనర్హుడున్నారు.
చంద్రబాబువి పచ్చి అబద్దాలు: బుగ్గన
ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఏపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వేరుగా ఆరోపించారు. గతంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ఇప్పుడు చంద్రబాబు ప్రారంభిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనిని ఇప్పుడు తాను చేసినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications