దోస్త్ మేరా దోస్త్: ఆసుపత్రిలో వరప్రసాద్‌ను పరామర్శించిన చంద్రబాబు
స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం.... స్నేహం గురించి ఓ సినీ కవి రాసిన పాట ఇది. స్నేహితుల హోదాల్లో ఎంత వ్యత్యాసమున్నా కానీ, స్నేహం వారిని దగ్గరకు చేరుస్తోంది. స్నేహనికి ఉన్న గొప్పతనం అదే అంటారు.
విజయవాడ: స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం.... స్నేహం గురించి ఓ సినీ కవి రాసిన పాట ఇది. స్నేహితుల హోదాల్లో ఎంత వ్యత్యాసమున్నా కానీ, స్నేహం వారిని దగ్గరకు చేరుస్తోంది. స్నేహనికి ఉన్న గొప్పతనం అదే అంటారు. అందుకే స్నేహనికి కొందరు ప్రాణాలు కూడ ఇస్తారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మిత్రుడు మేకా వీరవెంకట సత్యవరప్రసాద్ ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి. కొండేపాడుకు చెందిన సత్యవరప్రసాద్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

మెరుగైన చికిత్స కోసం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకొన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ఆయుష్ ఆసుపత్రికి వెళ్ళి వరప్రసాద్‌ను పరామర్శించారు.

చికిత్స వివరాలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. ఇంకా మెరుగైన చికిత్స అవసరమైతే వేరే ఆసుపత్రికి తరలించాలంటే అవసరమైన సహయం చేస్తానని బాబు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications