చంద్రబాబు అంటే ఏమిటో చూపిస్తా, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటే, బిజెపితో పొత్తుంది
టిడిపిలో నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అసలు చంద్రబాబునాయుడు అంటే ఏమిటో చూపిస్తానంటూ ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు.
హైదరాబాద్: టిడిపిలో నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అసలు చంద్రబాబునాయుడు అంటే ఏమిటో చూపిస్తానంటూ ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో మినీ మహానాడు సందర్భంగా కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య చోటుచేసుకొన్న గొడవల నేపథ్యంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
బుదవారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనాయకులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో చోటుచేసుకొన్న ఘటనపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇక సహించేది లేదని ఆయన హెచ్చరించారు.క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఇక చంద్రబాబు అంటే చూపిస్తానని ఆయన హెచ్చరించారు.
కర్నూల్ జిల్లా జంట హత్యల విషయంలో వాస్తవాలు ఏమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు బాబు. హత్య రాజకీయాలకు టిడిపి దూరమన్నారు. హత్యరాజకీయాలను టిడిపి ఏనాడు ప్రోత్సహించదని చెప్పారు.
బిజెపితో మిత్రబంధం కొనసాగుతోందని ఆయన చెప్పారు. బిజెపి నాయకులు టిడిపి పై విమర్శలు చేస్తే ఆ పార్టీ జాతీయ నాయకత్వం బిజెపి నాయకులపై చర్యలు తీసుకొంటుందని ఆయన పార్టీ నాయకులకు చెప్పారు.












Click it and Unblock the Notifications