కేసీఆర్ నాకంటే జూనియర్... అయినా ఇంటికెళ్లి పిలిచానుగా?: నేతలకు చంద్రబాబు క్లాస్
అమరావతి: నేతల్లో అహంకారం పెరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీకి నష్టం జరక్కుండా చూడాలంటే అహంకారాన్ని ఆమడదూరంలో ఉంచాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు.
ఉన్నట్టుండి చంద్రబాబు నోటి నుంచి ఈ వ్యాఖ్యలేంటని అనుకుంటున్నారా? నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో భూముల రేట్లు భారీగా పెరిగాయి. ఈ కారణంగా అక్కడి టీడీపీ చెందిన నేతల్లో అహంకారం పెరుగుతోందట.

ఈ విషయాన్ని గ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని కలిసిన కృష్ణా, గుంటూరు నేతలకు అహంకారం తగ్గించుకోవాలని క్లాస్ పీకారని విశ్వసనీయ సమాచారం.
‘‘మీ భూముల ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది. మీ అహాలు తగ్గించుకొని అందరినీ కలుపుకెళ్లండి. కేసీఆర్ నాకంటే జూనియర్. ఎన్ని సమస్యలున్నా ఆయన ఇంటికి వెళ్లి నేరుగా నేనే శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానించి వచ్చా. అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే'' అని చంద్రబాబు హితవు పలికారు.












Click it and Unblock the Notifications