వారణాశి నుంచి చంద్రబాబుకు పిలుపు: అప్పుడే ఆ హోదా

Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

నాలుగో దశలో ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక అయిదో విడతపై దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల కమిషన్. 20వ తేదీన ఈ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. బిహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లఢక్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉంటుందా రోజున.

Chandrababu Naidu will participate in the nomination of PM Modi in Varanasi today

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. నేడు మోదీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాశికి చేరుకున్నారు.

ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారాయన. 2014, 2019 నాటి ఎన్నికల్లో వారణాశి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, 2019లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌ను ఓడించారు.

మూడోసారి ఇక్కడి నుంచే బరిలో దిగనున్నారు. నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల నాయకులకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కూ ఆహ్వాన పత్రాలు అందాయి.

వారిద్దరూ నేడు వారణాశికి బయలుదేరి వెళ్లనున్నారు. నామినేషన్ వేసే సందర్భంగా మోదీ నిర్వహించనున్న భారీ రోడ్ షోలో వారిద్దరూ పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభకూ హాజరవుతారు. ఈ రాత్రికి మళ్లీ రాష్ట్రానికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+