బాబ్లీ ప్రాజెక్టు కేసు, అరెస్ట్ వారెంట్: కోర్టుకు హాజరుపై చంద్రబాబు కీలక నిర్ణయం
Recommended Video

అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు కేసు వ్యవహారంలో తన తరఫున న్యాయవాదిని పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్ణయించారు. తన తరఫున రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, ఇతర అధికారులతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఇటీవల చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై పలువురితో చర్చించిన అనంతరం లాయర్‌ను పంపించాలని, రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.

చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గత గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అప్పుడు పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
బార్డర్ దాటడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో టీడీపీ నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించారు. ధర్మాబాద్ నుంచి ఔరంగబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లారు. వారు అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వచ్చారని తరలించారు. ఈ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి ఈ అరెస్ట్ వారెంట్ వచ్చింది. నాడు చంద్రబాబు సహా పలువురిపై లాఠీచార్జ్ జరిగింది.
నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీశారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
{document1}
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications