చంద్రబాబు ఎందుకు టైం పాటించరంటే ? రీజన్ కనిపెట్టిన రఘురామ..!
ఏపీ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నేతగా పేరున్న సీఎం చంద్రబాబుపై ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన టైం పాటించరని చెప్పుకొచ్చారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయనే చెప్పేసారు. చంద్రబాబు ఇవాళ వజ్రోత్సవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నా అందుకు ఆయన చెప్పిన కారణం మాత్రం రీజనబుల్ గానే ఉంది.
ఇవాళ విజయవాడలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు.. చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్నవారెవరైనా గొప్పగా రాణిస్తారని చెప్పుకొచ్చారు. ఆయనకూ, ఇతర ముఖ్యమంత్రులకు ఉన్న తేడా ఏంటని తనను చాలామంది అడిగారని, దురాభిమానులు లేకుండా మంచి అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని తాను చెప్పినట్లు వెల్లడించారు.

టీడీపీలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారని రఘురామ తెలిపారు. అయితే చంద్రబాబుకి టైం మేనేజ్మెంట్ తెలియదని తాను కూడా ఒకటికి రెండు సార్లు అనుకున్నానని, ఆయన టైం మేనేజ్మెంట్ ఎందుకు పాటించలేకపోతున్నారో చివరికి తాను కనిపెట్టానని తెలిపారు. ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా నిష్టగా వింటారని.. అంతగా టైం మర్చిపోతారని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా టైం మేనేజ్మెంట్ విషయంలో ఒకరిద్దరికీ ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.టైం ట్రావెల్ చేయగల నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు.
చంద్రబాబుని వ్యతిరేకించేవారైనా సరే ఆయన విజన్‌ని అంగీకరించి తీరాల్సిందేనని రఘురామ తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం కాస్తా ఆలస్యమైనా.. ఇప్పుడు అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీలో ఉన్న సుగుణం ఓర్పు, సుభాష్ చంద్రబోస్‌లోని విప్లవ ధోరణిని మనం చంద్రబాబులో చూస్తామన్నారు. అయితే చంద్రబాబులో ఎక్కువగా ఓర్పు, సహనమే మనం చూస్తామని.. అప్పుడప్పుడు విప్లవధోరణి కూడా బయటపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications