బాబుకు లేదు: జగన్‌పై బొజ్జల, 26కు శాఖల కుదింపు

మంత్రిత్వ శాఖలను 60 నుంచి 26కు కుదిస్తున్నామని బొజ్జల చెప్పారు. అవినీతి పరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడతామన్నారు. తొలి కేబినెట్ సమావేశం ఈ నెల 12న ఆంధ్రా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఓడిపోయిన బాధలో జగన్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అవినీతిపరులను మా ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు.
శాఖలపై ఇంకా నిర్ణయించలేదు: గంటా
ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని మరో మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఎవరికి ఏ శాఖ ఇచ్చినా తాము చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ఒకే ప్రాంతం కాకుండా.. అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
మంత్రులతో చంద్రబాబు వరుస భేటీలు
చంద్రబాబు నాయుడు మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాజధాని నిర్మాణం, శాఖలు... తదితర అంశాల పైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారనిచంద్రబాబు మంత్రులతో చెబుతున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేయాలంటూ వారికి కర్తవ్య బోధన చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తు పెట్టుకుని, మరోసారి అధికారం కట్టబెట్టారన్నారు.












Click it and Unblock the Notifications