కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు ఎమ్మెల్సీ: కొనసాగుతున్న ఉత్కంఠ, ఆశావాహులకు బాబు హామి

|
Google Oneindia TeluguNews

అమరావతి: గత రెండ్రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేతలతో సమాలోచనలు జరిపారు.

Recommended Video

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు, ట్విస్ట్ లే ట్విస్ట్ లు !

శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

గడువు దగ్గర పడుతోంది..

గడువు దగ్గర పడుతోంది..

మంగళవారంతో నామినేషన్ గడువు పూర్తవుతుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై సీనియర్ నేతలు, కర్నూలు జిల్లా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఉత్కంఠ కొనసాగుతూనే

ఉత్కంఠ కొనసాగుతూనే

టికెట్ ఆశిస్తున్న కేఈ ప్రభాకర్, ఎం శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

రెండు వర్గాలుగా..

రెండు వర్గాలుగా..

ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఓ వర్గం, గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతుండటంతో ఈ పంచాయతీ తెగడం లేదు.

నిరాశ వద్దు..

నిరాశ వద్దు..

ఈ నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సహకరించాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. పోటీ చేసే అవకాశం దక్కని అభ్యర్థులు నిరాశ చెందవద్దని, భవిష్యత్‌లో అవకాశం స్తామని వారికి హామి ఇచ్చారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu responded on kurnool mlc candidate issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X