జగన్ కు చంద్రబాబు మరో షాక్..! విజయవాడ వరదల కేంద్రంగా...!

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలను ఉన్నతాధికారుల సాయంతో ఓ రేంజ్ లో జగన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు అదే అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొత్త సీఎం చంద్రబాబుకు సైతం తలనొప్పిగా మారుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి వారిని గుర్తించి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన బెట్టేశారు. కానీ ఇలాంటి వారిలో కొందరికి విజయవాడ వరదలు కలిసొచ్చాయి.

విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లక్షల మంది మూడు రోజులుగా నీళ్లలోనే నానుతున్నారు. వారికి అందించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఆహారం తయారు చేయిస్తున్నా వారికి అందించలేని పరిస్ధితి నెలకొంది. సీఎం చంద్రబాబు స్వయంగా నగరంలో పడవల్లో తిరుగుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నా ఇంకా బాధితులకు ఆహారం అందని పరిస్ధితి ఎందుకొస్తోందంటూ మంత్రులను ఆరా తీశారు. దీంతో వారు చెప్పిన సమాధానం చంద్రబాబుకు సైతం షాకిచ్చింది.

Chandrababu order action against pro-jagan officials caused delay in Vijayawada rescue operations

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని పలువురు అధికారులను వరద సహాయక ప్రాంతాల్లో బందోబస్తుకు వాడుకుంటున్నామని, కానీ వీరు సహాయక చర్యలు వేగంగా ముందుకు సాగకుండా ఆాటంకాలు కల్పిస్తున్నారని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. దీంతో చంద్రబాబు వీరిపై సీరియస్ అయ్యారు. ఇలా సహాయక చర్యలకు అడ్డుపడుతున్న అధికారుల జాబితా తయారు చేసి ఎక్కడెక్కడ ఇలా జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా అధికారులను ప్రభుత్వం గుర్తించింది.

వీరిలో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, సీహెచ్ విజయరావు, రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ జోషి, డీఎస్పీలు సత్యానందం, గోపాలకృష్ణ, శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. విజయవాడ వరద సహాయకచర్యల్లో వీరి పాత్రపై రిపోర్ట్ రాగానే చంద్రబాబు చర్యలకు ఆదేశాలు ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+