పనులున్నాయంటూ బాబుకు నేతల షాక్: నేతలపై బాబు ఫైర్

పార్టీ సమన్వయకమిటీ సమావేశానికి హజరుకాని టిడిపి జిల్లా అధ్యక్షులపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

అమరావతి: పార్టీ సమన్వయకమిటీ సమావేశానికి హజరుకాని టిడిపి జిల్లా అధ్యక్షులపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

పనులున్నాయంటూ సమావేశాలకు హజరుకాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పనులు లేకే సమావేశాలు నిర్వహిస్తున్నామా అంటూ బాబు వారిపై మండిపడ్డారు.

టిడిపి సమన్వయకమిటీ సమావేశం గురువారంనాడు అమరావతిలో నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నిక అంశంతో పాటు జన్మభూమి కమిటీల ప్రక్షాళనపై చర్చించారు.

Chandrababu order to party leaders everyone should attend coordination meeting

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధిస్తారనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.అయితే భారీ మెజారిటీపైనే కేంద్రీకరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

జన్మభూమి కొత్త కమిటీలను ఈ నెలాఖరులోపుగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రేషన్, పెన్షన్లు, ఇళ్ళ నిర్మాణంపై మంచి స్పందన వస్తోందన్నారు.

అన్న అమృతహస్తంపై సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. 67 శాతం మంది సరుకులిస్తే ఇంటికెళ్ళి వండుకొంటామన్నారు. ఒక చోటకు వెళ్ళి తినాలంటే ఇబ్బందిని గర్బిణీలు చెబుతున్నారని ఆయన తెలిపారు. అన్న అమృతహస్తంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+