ఉద్యోగులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్..! జగన్ చివరి నిర్ణయానికి బ్రేక్..

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు పూర్తిగా కూటమి వైపు మొగ్గారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్ధికంగా, మానసికంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కూటమి పార్టీలకు ఓటేసి గెలిపించారు.

అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారికి తొలి షాక్ తగిలింది. దీంతో ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడిపోయింది. వెంటనే తేరుకుని మరో ఆదేశం ద్వారా సీఎం చంద్రబాబు వారికి ఊరటనిచ్చారు.

chandrababu order to put employees gps order in abeyance till further decision

గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. ఇందులో సీపీఎస్ విధానం రద్దు కూడా ఒకటి. తమకు అధికారమిస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. కానీ నాలుగేళ్లు గడిచినా సీపీఎస్ రద్దు కాకపోవడంతో ఉద్యోగులు గొంతెత్తారు. దీంతో ఉద్యోగ నేతల్ని తమవైపు తిప్పుకుని వైసీపీ ప్రభుత్వం సీపీఎస్ పూర్తిగా రద్దు చేయకుండా దాని స్ధానంలో జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీమ్) పేరుతో మరో పథకం తెచ్చింది. దీనికీ ఉద్యోగులు అంగీకరించలేదు. అయినా ఎన్నికలకు ముందు దీని అమలు కోసం ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ చివరి సంతకం చేసి వెళ్లిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది.

దీంతో కూటమి సర్కార్ లో ఉద్యోగులకు తొలి దెబ్బ తగిలినట్లయింది. ఎన్నో ఆశలతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇలా జీపీఎస్ గెజిట్ ఇచ్చి మోసం చేశారని వారు భావించారు. విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో వెంటనే స్పందించారు. జీపీఎస్ పై జారీ అయిన ఆదేశాల్ని నిలిపేయాలని ఆదేశించారు. అంతే కాదు ప్రభుత్వానికి తెలియకుండా జీపీఎస్ ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. సీపీఎస్ రద్దుపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ దీనిపై త్వరలో చర్చించి తుది ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+