ఏబీవీ ఎఫెక్ట్- కేబినెట్లో చంద్రబాబు కీలక ఆదేశాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది, అలాగే అభివృద్దినీ పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఒక్కటే లోటు. ఇదంతా కేవలం ఇద్దరు, ముగ్గురి ఖాతాల్లో వేసే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నాయన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఇది కాస్తా తాజాగా ముదిరింది. దీనికి కారణం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు కీలక కార్యక్రమాల్లో ఆ ఇద్దరు, ముగ్గురే దర్శనమివ్వడం. దీనిపై విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించారు.

https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ips-officer-ab-venkateswara-rao-takes-dig-at-naidu-says-three-men-cabinet-is-enough-504447.html
https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ips-officer-ab-venkateswara-rao-takes-dig-at-naidu-says-three-men-cabinet-is-enough-504447.html

తాజాగా ఏపీ సర్కార్ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించింది, అలాగే ఉత్తరాంధ్రకు పోలవరం ఎడమకాలువ ద్వారా నీటిని విడుదల చేసింది. ఈ రెండు కార్యక్రమాల్లోనూ, పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లోనూ కేవలం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని మోడీ ఫొటోలు మాత్రమే దర్శనమిచ్చాయి. సంబంధిత శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు ఫొటో ఎక్కడా కనిపించలేదు. దీంతో చంద్రబాబుకు గతంలో ఇంటలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు బహిరంగంగానే ఈ నిర్ణయాల్ని వ్యతిరేకించారు. కేబినెట్లో ముగ్గురే మంత్రులుండి, మిగతా వాళ్లను తీసేస్తే ఖర్చు మిగులుతుందంటూ సెటైర్లు కూడా వేశారు. దీంతో సీఎం చంద్రబాబు ఇవాళ కేబినెట్లో స్పందించారు.

Chandrababu Orders Ministers Photos at Inaugurations After Criticism Over Veligonda Polavaram Events
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అమరావతి నుంచి రైతుల వరకూ..!
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అమరావతి నుంచి రైతుల వరకూ..!

వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఫోటో లేకపోవడాన్ని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని ఆక్షేపించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫోటోలు లేకపోవడం సరికాదని తెలిపారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇకపై మంత్రుల ఫొటోలు కూడా అధికారిక కార్యక్రమాల్లో దర్శనమివ్వబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+