Jayaho BC: రేపు లోకేష్ సీటులో చంద్రబాబు-పవన్ రెండో సభ..! మరో డిక్లరేషన్..

తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ,జనసేన తొలి ఉమ్మడి సభ విజయవంతం కావడంతో అదే ఊపులో మరో సభ నిర్వహించేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి. రేపు గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండో ఉమ్మడి సభ నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. రెండు పార్టీల తరఫున ఈసారి ఉమ్మడి బీసీ డిక్లరేషన్ తయారు చేస్తున్న నేపథ్యంలో దాన్ని బీసీల జనాభా అధికంగా ఉన్న మంగళగిరిలో విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం చంద్రబాబు 19 మంది టీడీపీ, జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చలు జరిపి డిక్లరేషన్ రూపొందించింది. దీన్ని రేపు మంగళగిరిలో విడుదల చేస్తారు. మార్చి 5న జరిగే రాష్ట్ర స్థాయి "జయహో బీసీ" సభను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరు పార్టీల శ్రేణుల్ని కోరారు.

chandrababu pawan kalyan to hold jayaho bc meeting in mangalagiri tommorow

బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ను మార్చి 5 న జరిగే బీసీ బహిరంగ సభ లో ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీ లకు చేసిన ద్రోహం, మోసాల బారి నుండి కోలుకుని పూర్వ వైభవం పొందేలా, అన్ని రంగాల్లో బీసీ లు దూసుకుపోయేలా టీడీపీ ప్రోత్సహిస్తుందన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున యూనివర్సిటి ఎదురుగా నిర్వహించ తలపెట్టిన "జయహో బీసీ" భారీ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు ఏకమై కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+