Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ తప్పిన చంద్రబాబు లెక్క-ప్రత్యర్ధి వ్యూహంలో చిక్కి విలవిల-సేమ్ పరిషత్ సీన్ రిపీట్

వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న ఏపీ రాజకీయాల్లో ఇరు పార్టీల అధినేతలు జగన్, చంద్రబాబు వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా తమకు తెలియకుండానే కొన్నిసార్లు ఊబిలో కూరుకుపోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ టీడీపీ అధినేత చంద్రబాబు. తన పార్టీకి మైలేజ్ తెచ్చిపెడుతుందని లెక్కలేసుకుంటూ తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం బూమరాంగ్ కావడమే కాకుండా పరిస్ధితిని ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మార్చేస్తోంది. దీంతో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పరిస్ధితి దయనీయంగా మారిపోయింది.

40 ఇయర్స్ ఇండస్ట్రీ

40 ఇయర్స్ ఇండస్ట్రీ

చంద్రబాబుకూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ పేరుకూ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది గతంలో టాలీవుడ్ సినిమాల్లో వినిపించిన డైలాగే అయినా దీంతో చంద్రబాబుకు మాత్రం గొప్ప అనుబంధమే ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా ఏపీ రాజకీయాల్లో తన అనుభవం 40 ఇయర్స్ గా చెప్తుంటారు. అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు మించిన వారు లేరని కూడా భావిస్తుంటారు. కానీ చాలా సార్లు ఆయన నిర్ణయం తీసుకోవడమే గగనంగా మారడం దగ్గరి నుంచి తీసుకున్న నిర్ణయాలు సైతం బూమరాంగ్ గా మారిపోవడం చూస్తూనే ఉన్నాం. దీంతో చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం ముగింపు దశకు చేరుకుంటోందన్న చర్చ మొదలైంది.

 చంద్రబాబు మరో తప్పిదం

చంద్రబాబు మరో తప్పిదం

నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తాజాగా ఓ కీలక నిర్ణయం విషయంలో తప్పటడుగు వేశారు. అసలే రాజకీయాల్లో వేసే ప్రతీ అడుగూ కీలకంగా మారిపోతున్న నేపథ్యంలో ఎంతో ఆచితూచి వ్యవహించాల్సిన ఆయన.. అందరి కంటే ముందే నిర్ణయం తీసుకోవడమే కాకుండా అంతే వేగంగా దాన్ని వెనక్కి కూడా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి ఆ నిర్ణయంపై ముందుకెళ్లలేక, వెనక్కీ వెళ్లలేక సతమతం అవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అదే సమయంలో వరుస ఓటములతో కుదేలవుతున్న ఆయన పార్టీ టీడీపీ కూడా ఇబ్బందుల్లో పడింది.

చంద్రబాబు లెక్క తప్పింది ఇక్కడే

చంద్రబాబు లెక్క తప్పింది ఇక్కడే

రాజకీయాల్లో ప్రత్యర్ధి బలహీనతలు, బలాల ఆధారంగా లెక్కలు వేయడంలో చంద్రబాబు దిట్ట. అలాంటిది ఆయన లెక్క మరోసారి తప్పింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన బద్వేల్ ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయింది. ముందు అక్కడ అభ్యర్ధిగా గతంలో పోటీ చేసి ఓడిన ఓబుళాపురం రాజశేఖర్ ను ప్రకటించారు. ఆ తర్వాత వైసీపీ ఏకగ్రీవ మంత్రం జపించే సరికి తడబడి తిరిగి కోలుకుని తమ అభ్యర్ధిని ఉపసంహరించుకుని ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించారు. అక్కడే ఆయన లెక్క తప్పింది.

కాంగ్రెస్, బీజేపీ ఎంట్రీతో మారిన లెక్కలు

కాంగ్రెస్, బీజేపీ ఎంట్రీతో మారిన లెక్కలు


బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ ఎప్పుడైతే ఏకగ్రీవం చేద్దామని ప్రకటించిందో అప్పుడే చంద్రబాబు వేగంగా కదిలారు. అందరి కంటే ముందే ఉపఎన్నికలో పోటీ చేయకుండా గత సంప్రదాయాల ప్రకారం ఏకగ్రీవానికి సహకరిస్తామని తేల్చిచెప్పేశారు. ఎలాగో ప్రధాన విపక్షమైన తాము పోటీ నుంచి తప్పుకుంటే మిగతా విపక్షాలు కూడా అదే బాట పడతాయని చంద్రబాబు ఆశించారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేసేందుకు సై అంటే సై అన్నాయి. దీంతో ఏకగ్రీవమవుతుందని భావించిన చంద్రబాబు లెక్క కాస్తా ఉపఎన్నికకు దారి తీసింది. ఇప్పుడు వైసీపీతో పోటీ పడేందుకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

 చంద్రబాబు ప్లాన్ బూమరాంగ్ ?

చంద్రబాబు ప్లాన్ బూమరాంగ్ ?


బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయకుండా వైసీపీ ఏకగ్రీవానికి మద్దతిచ్చి ఆ క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు బాగానే వ్యూహం రచించారు. కానీ కాంగ్రెస్, బీజేపీల్ని మాత్రం అంచనా వేయలేకపోయారు. దీంతో వారిద్దరూ ఒకరి వెంట మరొకరు పోటీలో ఉంటామని ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు ఏకగ్రీవం కానీ ఎన్నికకు దూరంగా ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయిపోయింది. ఇప్పుడు వైసీపీతో బలహీనమైన కాంగ్రెస్, బీజేపీ పోటీ పడే ఎన్నికలకు దూరంగా ఉండలేక, అలాగని ఎన్నికల్లో పోటీ చేస్తామని మళ్లీ చెప్పలేక చంద్రబాబు సతమతం అవుతున్నారు. దీంతో బద్వేల్ ఉపఎన్నికలలో ప్రత్యర్దుల్ని తక్కువ అంచనా వేసిన చంద్రబాబుకు పరిస్దితి ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోయింది. గతంలో పరిషత్ ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని పోటీ నుంచి టీడీపీ విరమించుకున్నా చివర్లో మిగతా పక్షాలు పోటీకి దిగిపోయాయి. దీంతో టీడీపీ అభ్యర్దుల్ని తామే పరోక్షంగా ప్రోత్సహించాల్సి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+