రాజధాని: పక్కా ముందస్తు వ్యూహంతోనే చంద్రబాబు

హైదరాబాద్‌: విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని కృత నిశ్చయానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు శానససభలో ప్రకటనకు ముందు నుంచి పక్కా వ్యూహంతో కదిలినట్లు కనిపిస్తున్నారు. ముందస్తు వ్యూహంతోనే ఆయన విజయవాడను రాజధానిగా ఎంచుకోవడంపై పెద్ద యెత్తున వ్యతిరేకత రాకుండా చూసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటుచేయాలన్న దానిపై కేంద్రం నియ మించిన శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

విజయవాడలో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న సంకేతాలు పలుమార్లు ఇచ్చిన చంద్రబాబు విపక్షాల నుంచి ఎన్ని అభ్యంత రాలు వ్యక్తమైనా తన నిర్ణయం విషయంలో ఆయన వెనకడుగు వేయలేదు. ఏపిలో అధికారంలోకి వచ్చినాటి నుంచే చంద్రబాబునాయుడు అంతర్గతంగా కొత్త రాజధానిపై పూ ర్తి స్థాయి అధ్యయనం చేసి ముందుకెళ్లారని టిడిపి పార్టీ వ ర్గాలు పేర్కొంటున్నాయి.

Chandrababu pre planned on AP capital issue

కొత్తరాజధానికి అనువైన ప్రాంత అన్వేషణ కోసం శివరామకృష్ణన్‌ కమిటీని గత యూపిఏ ప్రభుత్వం నియమించిన విషయం తెలి సిందే. రాజకీయంగా ఏపి కొత్త రాజధానికి విజయవాడ అనువైన ప్రాంతం అని భావించిన చంద్రబాబు తాను అధికా రంలోకి వచ్చిన వెంటనే అక్కడి పరిస్థితులపై అధ్యయనానికి పూనుకున్నారు. కొత్త రాజధాని కోసం స్వయంగా నారాయణ కమిటిని చంద్రబాబు ఏర్పాటు చేశారు. పలు మార్లు విజయవాడ, గుంటూరు జిల్లాల మం త్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు.

విజయవాడ విషయంలో రాయలసీమ ప్రాంత నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తగ్గించడానికి రాయలసీమకు ఆయన వరాల జల్లు కురిపించారు. కర్నూలులో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు నిర్వహించి పలు హామీలను ఇచ్చారు. మొదటి నుంచీ విజయవాడ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేస్తామనే సంకేతాలను మొదటి నుంచి ప్రజల్లోకి పంపిస్తూ వచ్చారు.

విజయవాడ సమీపంలో కొత్త రాజధాని ఏర్పాటవుతుందనే సంకేతాలు వెళ్లినప్పుడు రాయలసీమలో ఆందోళనలు ప్రారంభమైనట్లు కనిపించినప్పటికీ పెద్దగా ఊపు రాలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఫల్యం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+