వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లిమర్లలో చంద్రబాబు రోడ్ షో-ఉత్తరాంధ్రపై వైసీపీ పెత్తనమేంటని ప్రశ్న-బొత్సకు విద్యామంత్రా ?

|
Google Oneindia TeluguNews

ఉత్తరాంద్ర జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లాలో పలు చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లిమర్లలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మరోసారి వైసీపీ నేతలు, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. క్విట్ జగన్-సేవ్ ఏపీ నినాదాన్ని ఆయన మరోసారి వినిపించారు.

విజయనగరం అంటే అశోక్ గజపతిరాజు కుటుంబం, వారు ఏర్పాటు చేసిన సేవా సంస్ధలు,దేవాలయాలు గుర్తుకొస్తాయని, అలాంటి సంస్ధలమీద, దేవాలయాలపైన కేసులు పెడతారా అని జగన్ ప్రభుత్వాన్ని చంర్రబాబు ప్రశ్నించారు. గడప, గడపకూ వైసీపీ నేతలు వస్తున్నారు, మీకు జరిగిన అన్యాయం చెప్పి నిలదీయండని ప్రజలకు సూచించారు. శ్రీకాకుళం రాకముందు అందరూ భయభ్రాంతులయ్యారని, తాను రామతీర్ధం వచ్చినప్పుడు నామీదా కేసులు పెట్టారని చంద్రబాబు ఆక్షేపిచారు. ఏం పీక్కుంటారో పీక్కోడని చంద్రబాబు సవాల్ విసిరారు.

chandrababu question ysrcp leaders ownership on northern andhra in nellimarla road show

ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతోందని, ఇప్పటికే అన్ని ఛార్జీలూ పెరిగాయి, త్వరలో ఆర్టీసీ ఛార్జీలూ పెంచుతారంట అని చంద్రబాబు విమర్శించారు. గతంలో తాను కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు ఇచ్చానని, కానీ ఇప్పుడు కరెంటే రావడం లేదన్నారు.సీఎం జగన్ కు ఇప్పుడు చావు తెలివి తేటలు వచ్చాయని, ఖాళీ ఇళ్లకూ మినిమం ఛార్జీలు వడ్డిస్తున్నారన్నారు.మద్యం, పెట్రోల్ ధరలు పెరిగాయని, పేదల కూలీ పెరిగిందా అని ప్రశ్నించారు.కానీ ప్రజలకు కోపం రావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పొట్ట కొట్టిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు

అందరినీ భయపెట్టి సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదులుగాతయారయ్యారని చంద్రబాబు విమర్శించారు. మీరు ఏ ఊరికి రౌడీలని ప్రశ్నించారు. ఖబడ్డార్.. ప్రజలు తిరగబెడితే మీరు పారిపోతారన్నారు. ప్రత్యేక హోదా వస్తుందని, అందరికీ ఉద్యోగాలు ఇస్తానని జగన్ చెప్పాడా అని చంద్రబాబు ప్రజల్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడల్ని వంచుతానని జగన్ చెప్పాడా లేదా అని అడిగారు.పోలీసుల్లో చాలా మార్పు వచ్చిందని, అనకాపల్లిలో పోలీసుల తరఫున మాట్లాడితే డీఏలు 17 కోట్లు విడుదల చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

chandrababu question ysrcp leaders ownership on northern andhra in nellimarla road show

విజయనగరంపై, ఉత్తరాంధ్రపై మీ పెత్తనం ఏంటని వైసీపీ నేతల్ని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంద్రలో సారా వ్యాపారం చేసుకునే బొత్సకు విద్యామంత్రి ఎందుకని ప్రశ్నించారు. పదో తరగతిలో విద్యార్ధులు ఎందుకు ఫెయిలయ్యారని ప్రశ్నిస్తే తల్లితండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టలేదని బొత్స చెప్తున్నారని, ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన పథకాలన్నీ ఇప్పుడు పోయాయని చంద్రబాబు విమర్శించారు.

వైసీపీ వాళ్లు ఇంగ్లీష్ నేర్పిస్తే తాను అడ్డుపడుతున్నట్లుచెప్తున్నారని, మీ ఇంగ్లీష్ తో ఉద్యోగాలు వస్తాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ గురువుల్ని ఎప్పుడు కించపరిచారో అప్పుడే విద్యావ్యవస్ధ నాశనమైందన్నారు. టీచర్లను తీసుకెళ్లి మందుషాపుల దగ్గర క్యూలైన్లో నిలబెట్టారని చంద్రబాబు విమర్శించారు. గురువును అవమానించిన వాడు బాగుపడ్డాడా అని జనాల్ని ప్రశ్నించారు. తాను ప్రారంభించిన ఐటీ ద్వారా ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, తాను ప్రభుత్వంలో టీచర్లు, పోలీసుల ఉద్యోగాలిస్తే ఇప్పుడు మాత్రం 5 వేలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా తాను ఉద్యోగమిచ్చినట్లు జగన్ లక్షసార్లు చెప్తున్నారన్నారు.

బాబాయ్ ను ఎవరు చంపారని జనాల్ని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసులో ఉన్న ముగ్గురు చనిపోయారని, కోడి కత్తి ఏమైందని అడిగారు. తూర్పుగోదావరిలో ఎస్సీ వ్యక్తి సుబ్రమణ్యాన్ని చంపేసిన ఎమ్మెల్సీకి వైసీపీ పాలాభిషేకాలు చేస్తోందని చంద్రబాబు ఆక్షేపించారు. శ్రీలంకలో జరిగేదే మీకూ జరుగుతందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తాను చూడని సీఎం పదవి కాదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బావుండాలంటే ఇంటింటిపై టీడీపీ జెండా ఎగరాలన్నారు.

English summary
tdp chief chandrababu on today slams ys jagan and ysrcp govt in his nellimarla road show in vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X