BP పెంచుతున్న చంద్రబాబు?

కొన్ని కొన్ని విషయాల్లో తాత్సార ధోరణి పనికిరాదని మన పెద్దలు చెబుతుంటారు

రాబోయే ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాదు.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా అత్యంత కీలకం. అందుకే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన సహజ స్వభావానికి విరుద్ధంగా దూకుడుగా రాజకీయం చేయడంతోపాటు ఏడాదిన్నర ముందుగానే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. దీంతో తమ నేతలో మార్పు వచ్చిందని, ఎన్నికల చివరి నిముషం వరకు తాత్సారం చేసే ధోరణి లేదంటూ నాయకులంతా సంబరపడిపోయారు.

 నిలవని సంబరం!

నిలవని సంబరం!


అయితే ఆ సంబరం వారికి ఎంతోసేపు నిలవలేదు. కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలు తమ వారసులను రంగంలోకి దించాలని చంద్రబాబును కోరుతున్నారు. తమకు బదులుగా వారికి సీటివ్వాలని కోరుతున్నారు. మొదట్లో ఓకే చెప్పిన బాబు ఇప్పుడు మాత్రం తాత్సార ధోరణితో ఉన్నారు. సీనియర్ల వారసులకు ఇవ్వాలా? వద్దా? అని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ యువతకు 40 శాతం సీట్లు కేటాయించాలని కాబట్టి సీనియర్ నేతల వారసులకు కూడా కేటాయించాలని కోరుతున్నారు.

 తాత్సార ధోరణి పనికిరాదు!

తాత్సార ధోరణి పనికిరాదు!


కొన్ని కొన్ని విషయాల్లో తాత్సార ధోరణి పనికిరాదని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే నియోజకవర్గాల్లో అభ్యర్థులను కేటాయించేందుకు కూడా తాత్సార ధోరణి ఉండరాదని, సాధ్యమైనంత ముందుగానే వారికి సీట్లు కేటాయిస్తే నియోజకవర్గంలో సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని ఎదుర్కోవడంతోపాటు ప్రత్యర్థి పార్టీ బలాబలాలపై దృష్టిపెట్టడానికి అవసరమైన సమయం దొరుకుతుందనేది సీనియర్ రాజకీయవేత్తల వాదన. రాజకీయ వారసులకు సీట్లిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడం కష్టమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

6నెలల ముందు చెప్పడంవల్ల ప్రయోజనం?

6నెలల ముందు చెప్పడంవల్ల ప్రయోజనం?


రాయపాటి సాంబశివరావు వారసుడు రాయపాటి రంగారావుకు సత్తెనపల్లి సీటు కేటాయించాలని కోరుతున్నారు. లేదంటే నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గంలో పార్టీని ఓడిస్తామని నేరుగా ప్రకటించారు. రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు సంబంధించిన విషయం ఇంతవరకు తేలలేదు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న గ్రీష్మ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామనే హామీని లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు. ఇటువంటివారు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ ఏ విషయం తేల్చిచెప్పడంలేదు. ముందుగా చెప్పేస్తే తమ దారి తాము చూసుకుంటామని, ఎన్నికలకు 6నెలలు ముందుగా ప్రకటించడం వల్ల ఉపయోగం ఏమిటని వీరంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే పార్టీ అధినేతగా చంద్రబాబునాయుడు ఆలోచన ఏమిటనేది కూడా చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+