Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'మోడీ సర్వేలో చంద్రబాబుకు 8వ ర్యాంక్', సీఎంకు కోట్ల సవాల్

కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయించిన సర్వేలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎనిమిదో స్థానం వచ్చిందని శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య గురువారం విమర్శఇంచారు. చంద్రబాబు తన చుట్టూ ఓ రకమైన ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో ప్రజలను బతకమంటున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ కష్టపడితే, చంద్రబాబు అధికారం: రూటుమార్చిన బిజెపి, కాంగ్రెస్

రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. కరవు పైన తాను చేయించిన సర్వేను తానే నమ్మలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు.

చంద్రబాబుకు కోట్ల సవాల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గురువారం నాడు సవాల్ చేశారు. రెయిన్ గన్‌లతో కనీసం చంద్రబాబు పర్యటించిన గ్రామాల్లో కూడా పంటలు కాపాడలేకపోయారని ఆన్నారు.

Congress leader C Ramachandraiah said that CM Chandrababu ranked 8th in Narendra Modi's survey.

తాను దీనిని నిరూపించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. రెయిన్ గన్‌లతో పంటలను కాపాడానని చెబుతూ చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారన్నారు. రెయిన్ గన్‌ల వల్ల రాయలసీమ ప్రాంతంలో ఎక్కడా పంటలు పండలేదని చెప్పారు.

పంటలు పండకపోగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించిందన్నారు. అక్కడకు వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు. ఈ నెల 19వ తేదీన కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+