కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులను ఆదుకొనేందుకే రుణ మాఫీ: చంద్రబాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకుగాను రుణమాఫీ హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
చెప్పారు. కొందరు రుణమాఫీలో లబ్ధి పొంది తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో హరిత విప్లవంతో ఆహార ఉత్పత్తి పెరిగి కరవు తగ్గిందన్నారు.

సోమవారం ఆయన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచలో మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు.మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా మెగాసీడ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

Chandrababu released third phase funds of crop loan

తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని, దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా ఉండేదని గుర్తుచేశారు. గత పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చేవారని, పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

మూడో విడత కింద రూ.36.72లక్షల మంది రైతులకు రూ.3600 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఖాతాలు సరిగా లేకుంటే రైతు సాధికార సంస్థకు ఫోన్‌ చేయాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందేలా చూస్తామని చెప్పారు. నవంబర్‌ 16, 17 తేదీల్లో విశాఖకు బిల్‌గేట్స్‌ వస్తారన్నారు. వ్యవసాయంలో సాంకేతికత వినియోగంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

తంగడంచలోని 623 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సీడ్‌హబ్‌కు కేటాయించింది. రూ.670 కోట్ల వ్యయంతో ఈ విత్తన భాండాగారాన్ని ఏర్పాటుచేయనున్నారు. అమెరికాలోని అయోవా వర్సిటీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ భాగస్వామ్యంతో ఈ సీడ్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు.

English summary
Ap cm Chandrababu naidu laying foundation stone to mega seed project on Monday in Kurnool district.Chandrababu released third phase funds of crop loan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X