ఇకపై ఎఫ్‌బీ, ఇన్‌స్టా, వాట్సాప్‌కి నెలవారీ డబ్బు కట్టాల్సిందే..!!

మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారుల కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది. సోషల్ మీడియా ప్రపంచంలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉచితంగా లభించిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ఇకపై ప్రీమియం ఫీచర్ల కోసం నెలవారీ రుసుము వసూలు చేయనున్నాయి. ఈ ప్లాన్‌లు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోనూ అందుబాటులో ఉంటాయి.

మెటా ప్రవేశపెట్టిన "ప్లస్" వెర్షన్లు వినియోగదారులకు ప్రత్యేక టూల్స్, అధునాతన కస్టమైజేషన్ ఆప్షన్లతో పాటు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది. మెటా ఇప్పటివరకు ప్రధానంగా ప్రకటనల ద్వారా ఆదాయం పొందేది. ప్రస్తుతం కంపెనీ వ్యాపార వ్యూహాన్ని మార్చుకొని, ప్రకటనలతో పాటు సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీమియం ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి నేరువారీ రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది.

meta-shocking-decision-about-have-to-pay-monthly-fees-for-facebook-instagram-and-whatsapp-and-news

మెటా ధరలను వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్‌ ప్లాన్‌లు నెలకు $3.99 (సుమారు ₹387). వాట్సాప్ ప్లస్ నెలకు $2.99 (దాదాపు ₹290). భారతదేశంలో ఖచ్చితమైన ధరలను మెటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం.. వాట్సాప్ ప్లస్‌లో వ్యక్తిగతీకరణకు ప్రాధాన్యం ఇచ్చే అనేక ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి. వీటిలో కస్టమ్ చాట్ థీమ్‌లు, ప్రత్యేక రింగ్‌టోన్‌లు, ప్రీమియం స్టిక్కర్‌లు, మరిన్ని చాట్‌లను పిన్ చేసుకునే సౌలభ్యం వంటివి ప్రధానమైనవి.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్లస్ వినియోగదారులకు పలు ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలను ఎన్నిసార్లు చూశారో తెలుసుకోవడం, అపరిమిత 'క్లోజ్ ఫ్రెండ్స్' జాబితా, అలాగే వ్యూయర్స్ లిస్ట్‌లో కనిపించకుండా స్టోరీ ప్రివ్యూ వంటివి ఉన్నాయి. 24 గంటల పైన స్టోరీలను ఉంచే అవకాశం, వారానికి ఒక స్టోరీని బూస్ట్ చేయడం, ఎవరు చూశారో సులభంగా శోధించే ఫీచర్లూ అందుబాటులో ఉంటాయి.

మెటా ప్లస్ వినియోగదారుల కోసం అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను కూడా తీసుకొస్తోంది. యానిమేటెడ్ సూపర్ హార్ట్ రియాక్షన్‌లు, కస్టమ్ యాప్ ఐకాన్‌లు, బయోలకు ప్రత్యేక ఫాంట్‌లు, ఎక్కువ ప్రొఫైల్ పిన్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. ఈ కొత్త "ప్లస్" ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్న "మెటా వెరిఫైడ్" సేవకు భిన్నమని కంపెనీ స్పష్టం చేసింది. "మెటా వెరిఫైడ్" గుర్తింపు ధృవీకరణ, వినియోగదారుల సహాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త "ప్లస్" ప్లాన్‌లు మాత్రం ప్రీమియం స్థాయి వినియోగదారు అనుభవం మెరుగుదలపై దృష్టి పెడుతున్నాయి.

మెటా సోషల్ మీడియా యాప్‌లతో పాటు ఏఐ సేవల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. "మెటా వన్ ప్లస్" నెలకు $7.99 (సుమారు ₹775), "మెటా వన్ ప్రీమియం" నెలకు $19.99 (దాదాపు ₹1,939)గా ఉంటాయి. ఈ ప్లాన్‌లు యూజర్లకు మెటా ఏఐ సాయంతో ఇమేజ్‌లు, వీడియోలు సృష్టించడం, క్లిష్టమైన పనులను పూర్తి చేయడం వంటి సదుపాయాలను అందిస్తాయి.

క్రియేటర్లు, వ్యాపారాల కోసం మెటా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది. "మెటా వన్ ఎసెన్షియల్స్" నెలకు $14.99 (సుమారు ₹1,454) ధరతో వెరిఫికేషన్, మెరుగైన ప్రమోషన్ టూల్స్ అందిస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపారాల కోసం "మెటా వన్ అడ్వాన్స్‌డ్" ప్లాన్ రూపొందించారు. దీని ద్వారా సోషల్ మీడియా రీచ్ పెంచుకోవడం, ఫేస్‌బుక్ ఫీడ్‌లలో ప్రాధాన్యత వంటి ప్రయోజనాలు లభిస్తాయి. మెటా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+