రూ.5కే ఫిష్ మీల్స్, సువేందు మార్క్ పథకం - దేశంలోనే తొలిసారి, అసలు టార్గెట్..!!
పశ్చిమ బెంగాల్ లో సువేందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస నిర్ణయాలు ప్రకటిస్తోంది. టీఎంసీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. టీఎంసీ నేతలతోనూ ఆపరేషన్ ఆకర్ష్ కు సిద్దం అయింది. ఇదే సమయంలో సువేందు తాజాగా మరో కీలక ప్రకటన చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ 5 కే ఫిష్ మీల్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ పథకం అమలు నిర్ణయం వెనుక రాజకీయంగా ఉన్న వ్యూహం ఆసక్తి కరంగా మారుతోంది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మరో ఆసక్తి కర పథకాన్ని ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా రూ.5కే చేప భోజనం పెట్టే పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 400 చోట్ల క్యాంటిన్లు తెరచి పేదలకు నాన్ వెజ్ భోజనం అందిస్తామని చెప్పారు. బెంగాలీలు ఇష్టపడే చేపలతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్ణయించడం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ తరహా క్యాంటిన్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రూ.5కు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం అమలు చేస్తున్నారు. కానీ,పశ్చిమ బెంగాల్ లో చేపలతో భోజనం పెడతామని ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. బెంగాలీల జీవితంలో విడదీయరాని భాగమైన 'చేపల భోజనాన్ని' కేవలం రూ. 5 లకే అందిస్తామని ప్రకటించడం రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారింది.

సువేందు అధికారి నిర్ణయం వెనుక
కాగా.. ఈ పథకానికి రెండు పేర్లు పరిశీలిస్తున్నారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్, ఏపీలో అన్నా క్యాంటిన్, కర్ణాటకలో ఇందిరా క్యాంటిన్, రాజస్థాన్ లో అన్నపూర్ణ రసోయి అన్న పేర్లతో ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొలిసారిగా రూ.5 భోజనం పథకం అమలులోకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ హయాంలో ఈ క్యాంటిన్లను ప్రారంభించారని చెబుతున్నారు. కాగా.. బెంగాల్ లో మాత్రం ఇతర సంక్షేమ పథకాలకు భిన్నంగా చేప భోజనం రూ.5కే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బెంగాల్ ఆహార అలవాట్లలో చేపలకు ప్రాధాన్యత ఇస్తారు. టీఎంసీ గతంలో బీజేపీ లక్ష్యంగా చేసిన ఆరోపణలకు సమాధానంగా ఈ పథకం ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో చేపల వినియోగాన్ని, మాంసాహారాన్ని నిషేధిస్తుందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. సంస్కృతిని గౌరవిస్తున్నామనే సంకేతం ఇవ్వడానికే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications