చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ సైడ్ లవ్ సరిపోదు: పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు జనసేనతో టీడీపీ పొత్తు ఉండాలని కోరారు.

లవ్ సైడ్ సరిపోదంటూ జనసేనతో పొత్తుపై చంద్రబాబు

లవ్ సైడ్ సరిపోదంటూ జనసేనతో పొత్తుపై చంద్రబాబు

ఈ నేపథ్యంలో టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులు ఉండాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని చంద్రబాబు చమత్కరించారు. టీడీపీ అధినేత కుప్పం పర్యటన సందర్భంగా ఈ ఆసక్తికర చర్చ జరిగింది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేనతో పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు కలిసివస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

జగన్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు

జగన్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు

మూడ్రోజుల కుప్పం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తొలిరోజు బిజీబిజీగా గడిపారు. అధినేతకు ఘనంగా స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. రోడ్‌షోలతో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు చంద్రబాబు. రామకుప్పం మండలం అరిమానుపెంటలో రచ్చబండ నిర్వహించి..గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలతో ముచ్చటించారు చంద్రబాబు. అంతేగకా, కుప్పం పర్యటనలో సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సొంత తల్లిని, చెల్లిని కూడా.. జగన్‌ రాజకీయంగా వాడుకుని వదిలేశాడని విమర్శించారు.

వైసీపీలా రౌడీయిజం చేయలేదంటూ చంద్రబాబు

వైసీపీలా రౌడీయిజం చేయలేదంటూ చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును 71 శాతం టీడీపీ హయాంలోనే పూర్తి చేశామన్నారు. ఆ పనుల్ని కూడా తామే చేశామనీ.. వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు చంద్రబాబు. మూడేళ్ల పాలనలో జగన్మోహన్‌ రెడ్డి మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని విమర్శించారు అన్నింటా లూఠీ చేస్తున్నారనీ... ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారనీ చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారనీ.. తాను అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచించి ఉంటే కుప్పంలో ఆ పార్టీవాళ్లు ఒక్కరూ మిగిలేవారు కాదని వ్యాఖ్యానించారు.

English summary
chandrababu response on alliance with Pawan Kalyan's Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X