Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విందుకు కెసిఆర్ రావాల్సింది: బాబు, టి మంత్రులతో

హైదరాబాద్: గవర్నర్ నర్సింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వచ్చి ఉంటే బాగుండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం గవర్నర్ నర్సింహన్ ఇచ్చిన విందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఈ ఇఫ్తార్ విందుకు కెసిఆర్ హాజరుకకపోవడంతో చంద్రబాబు నాయుడు పై విధంగా స్పందించారు. విందుకు హాజరైన ఇతర తెలంగాణ మంత్రులతో చంద్రబాబు సరదాగా మాట్లాడారు. ఈ విందుకు చంద్రబాబు నాయుడితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు.

Chandrababu response on KCR not arriving to Governor iftar feast

ఇంకా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు జ్యోతుల నెహ్రూ, సిపిఐ ఇరు రాష్ట్రాల కార్యదర్శులు వెంకటరెడ్డి, రామకృష్ణ, సిపిఎం ఎమ్మెల్యే రాజయ్య, ఏపి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల డిజిపిలు అనురాగ్ శర్మ, జెవి రాముడు, అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా నమస్కరించగా.. ఆయన ప్రతి నమస్కారం చేశారు. కాగా, ఫొటులో దిగుతున్న సందర్భంలో జగన్.. అని పిలిచిన గవర్నర్ నర్సింహన్ ఫొటో దిగేందుకు రావాలని కోరారు. కార్యక్రమానంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అప్యాయంగా పలకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+