హైదరాబాద్‌లో ఏం పని అంటున్నారు: కెసిఆర్‌కు చంద్రబాబు కౌంటర్

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్‌లో ఏం పని అని కొందరు అంటున్నారని, తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కౌంటర్ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చందానగర్‌లో జరగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనే అని, తన రాజకీయ జీవితం ఇక్కడే ప్రారంభించానని చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా.. అందరూ తనను అభిమానిస్తారని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదని అన్నారు.

Chandrababu retaliates KCR on Hyderabad

తాను ఆదాయాన్ని పెంచాను కాబట్టే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా అమరావతికి శంకుస్థాపన చేస్తే నేరుగా తానే వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించానని అన్నారు.

కెసిఆర్ యజ్ఞం చేస్తే తాను వెళ్లి భాగస్వామి అయ్యానంటే.. రాష్ట్రం... రాష్ట్రం సహకరించుకోవాలనే చేశానని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయం వేరే...ప్రభుత్వాలు వేరని, పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో రాజీపడనని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+