నీలా దొంగతనం చేసి జైలుకెళ్లలేదు: జగన్‌పై ఊగిపోయిన చంద్రబాబు

హైదరాబాద్: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన ఆరోపణలపై శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏది దొరికితే అది మాట్లాడుతున్నారని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

హరిప్రసాద్ ఈవిఎం ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని నిరూపించడానికి ప్రయత్నించి జైలుకు వెళ్లాడని, ఆ రకంగా ఆయన త్యాగం చేశారని చెబుతూ "నీకు దొంగతనం చేయడం అలవాటైంది. అందరూ అలాగే అనుకుంటావు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడానికి హరిప్రసాద్ జైలుకు వెళ్లాడు. నీలాగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లలేదు" అని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu _ Jagan

ఎవరైనా ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్‌ను దొంగతనం చేస్తారా అని అడిగారు. ఫైబర్ ఆప్టిక్ లైన్ ప్రాజెక్టు టెండర్లలో పారదర్శకంగా వ్యవహరించామని, ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని ఆయన అన్నారు. జగన్ చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని, దేన్నీ పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నాడని టిడిపి సభ్యుడు గోరంటల్ బుచ్య్య చౌదరి అన్నారు.

జగన్ ఆరోపణలు చేయడానికి ముందు చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. మూడేళ్లలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్నారు. రూ.333 కోట్లతో 22500 కి.మీ మేర ఫైబర్‌ గ్రిడ్ లైన్లు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్‌తో పేదల జీవనప్రమాణాలు మెరుగుపడుతాయని చంద్రబాబు వివరించారు. మెరుగైన సేవలు అందించాలంటే టెక్నాలజీ అవసరమని చెప్పారు..

రూ.149కే ప్రతి ఇంటికి 10 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌, 100 చానళ్లు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2018 నాటికి డిజిటల్‌ ఏపీ కల సాకారమవుతుందన్నారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రణాళిక రూపొందిస్తున్నాం..విద్యాసంస్థల్లో వైఫై ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. త్వరలో ఈ-నిధిని ప్రవేశపెడతామన్నారు. సంక్షేమ పథకాలలో అవినీతికి అడ్డుకట్ట వేశామని చంద్రబాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+