నోరుందని మాట్లాడితే ఏం చేయాలో చేస్తాం, ఎక్కడ దాక్కున్నాడు: జగన్‌పై బాబు
హైదరాబాద్: నోరుందని ఏది పడితే అది మాట్లాడితే ఏం చేయాలో అది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్య చేసుకున్నవారికి సంతాపం ప్రకటించే తీర్మానంపై చర్చ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.
తలుపులు వేసి రాష్ట్ర విభజన తీర్మానం పెట్టినప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారని ఆయన అడిగారు. వెంకయ్య నాయుడు డిమాండ్ చేయడం వల్ల ప్రభుత్వం ఐదేళ్లు ఎపికి ప్రత్యేక హోదా ప్రకటించిందని ఆయన చెప్పారు. రాజకీయం కోసం తమ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారం ముఖ్యం కాదని ఆయన అన్నారు. జగన్‌కు అధికారం కావాలని ఆయన అన్నారు.
జగన్ లాలూచీ పడి, కుట్రలు చేయడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అన్నారు. కేసుల నుంచి బయటపడడానికి లాలూచీ పడ్డారని ఆయన జగన్మోహన్ రెడ్డిపై విమర్శ చేశారు. సభలో గొడవ పెట్టుకుని తప్పుదోవ పట్టించి, రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష వైసిపికి అవగాహన లేదని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన అన్నారు. కుట్రలూ కుతంత్రాలూ చేశారు కాబట్టి వైసిపిని అక్కడ కూర్చోబెట్టారని ఆయన అన్నారు.

ఎజెండా ప్రకారం రావాలని ఆయన ప్రతిపక్షానికి సూచించారు. అన్నింటికీ సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు. ప్రతి దానికీ తన మీదనే బురద చల్లుతున్నారని, అలా బురద చల్లితే మీరే చులకనవుతారని ఆయన అన్నారు. నోరుందని ఏది పడితే అది మాట్లాడితే ఏం చేయాలో తాము చేస్తామని ఆయన అన్నారు. రాజకీయాలు మాట్లాడితే సహించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన పాపం వైసిపిదేనని, దానివల్ల జరిగిన నష్టాన్ని సరిచేయడానికి తాము శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రత్యేక హోదాపై ఆత్మహత్యలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఆయన అంతకు ముందు అన్నారు. దానిపైనే చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications