బీజేపీ మిత్రుడి ఫొటో షేర్ చేసిన జగన్..!!

YS Jagan: నేడు.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి జన్మదినం. 61వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటోన్నారాయన. ఈ సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, అభిమానులు వేడుకగా జరుపుకొంటోన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కిషన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ అట్టడుగు స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. భారత్ వంటి అతి గొప్ప దేశంలో కీలకమైన బొగ్గు, గనుల రంగాన్ని ఆయన బలోపేతం చేస్తోన్నారని ప్రశంసించారు. శాఖల నిర్వహణలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు.

Chandrababu Revanth Reddy and YS Jagan wishes Union Minister G Kishan Reddy on his Birthday

కిషన్ రెడ్డికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని మోదీ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఫొటోను తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు.

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులను జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సైతం కిషన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కిషన్ రెడ్డిని తన మిత్రుడిగా సంబోధించారు. ఆయనతో కలిసి దిగిన ఓ ఫైల్ ఫొటోను ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నా మిత్రుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+