మీకు తెలియాలి.. పవన్‌తో అదే మాట్లాడా, అడ్డంగా దొరికిపోయారు: నేతలతో బాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో మంగళవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఇటీవల ఓ దైవ కార్యక్రమంలో భేటీ తదితర అంశాలపై మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్‌తో సాధారణంగానే భేటీ అయినట్లు చెప్పారు.

Recommended Video

    సిఎం చంద్రబాబు పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్

    ఆలయంలోని కార్యక్రమంలో తాను, పవన్ కళ్యాణ్ పాల్గొన్నామని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పారు. తాము హలో అంటే.. హలో అనుకున్నామని చెప్పారు. రాజకీయాలు, ఇతర అంశాలు మాట్లాడుకోలేదని తేల్చి చెప్పారు. పవన్‌తో తన భేటీపై చర్చ నేపథ్యంలో నేతలందరికీ క్లారిటీ ఉండాలనే ఉద్దేశ్యంతో చెబుతున్నట్లు తెలిపారు.

    బీజేపీ, వైసీపీ ఒక్కటేనని తేలిపోయింది

    బీజేపీ, వైసీపీ ఒక్కటేనని తేలిపోయింది

    నీతి అయోగ్ సమావేశంలో తాను కేంద్రాన్ని అడగాల్సినవి అన్నీ అడిగానని చంద్రబాబు చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం మనం గట్టిగానే పోరాడుతున్నామని చెప్పారు. కేంద్రం మెడలు వంచి అయినా స్టీల్ ప్లాంట్ సాధించుకుంటామని చెప్పారు. బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పడానికి గాలి జనార్ధన్ రెడ్డి మాటలే నిదర్శమని చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా బీజేపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు, బైక్ ర్యాలీలు కొనసాగుతాయని చెప్పారు. రేపు సైకిల్ యాత్రలు, ఎల్లుండి ధర్నాలు చేయాలన్నారు.

    రహస్య మంతనాలు, అడ్డంగా దొరికిపోయారు

    రహస్య మంతనాలు, అడ్డంగా దొరికిపోయారు

    28వ తేదీన ఢిల్లీలో ఎంపీల పోరాడానికి మద్దతుగా రాష్ట్రంలోను ధర్నాలు నిర్వహించాలని చంద్రబాబు సూచన చేశారు. రాష్ట్రంలో నిరసన సెగ ఢిల్లీని తాకాలన్నారు. ఉప ఎన్నికలు, ఢిల్లీలో పోరాటం తప్పించుకునే కుట్రలో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ దొంగాట బయటపడిందన్నారు. ఢిల్లీలో రహస్య మంతనాలతో దొరికిపోయారన్నరు. ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపి అడ్డంగా దొరికిపోయారన్నారు. పొంతన లేని సమాధానాలతో ప్రజల్లో మరింత చులకన అయ్యారన్నారు.

    ఇంత జరుగుతున్నా పట్టనట్లుగా బీజేపీ

    ఇంత జరుగుతున్నా పట్టనట్లుగా బీజేపీ

    ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి సొంత మైకు, బీజేపీ అద్దె మైకులా తయారయిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం సాయం ఇక రాదన్నట్లుగా కన్నా బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.కేంద్రం మెడలు వంచి అయినా స్టీల్ ప్లాంట్ సాధించుకుంటామన్నారు. బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ పట్టనట్లుగా ఉందన్నారు. అవినీతిపరులను కట్టడి చేయలేనిస్థితిలో బీజేపీ ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గాలి జనార్ధన్ రెడ్డి బృందం నాటకాలు ఆడుతోందన్నారు.

    మన టీం బాగుంది కానీ

    మన టీం బాగుంది కానీ

    జిల్లాల వారీగా సమీక్షలతో నేతల బలాబలాలపై అంచనాకు వస్తున్నానని చంద్రబాబు నేతలతో అన్నారు. మన టీమ్ బాగుందని, కానీ వీక్‌గా ఉన్న ఒకరిద్దరు ఆటగాళ్లతో టీమ్ పైన ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మనదే అన్నారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని ప్రచారం సాగుతోందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశాలున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఈవీఎంలపై మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వేలు ఎలా ఉన్నా నూటికి నూరు శాతం ప్రజలు మనతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.జూలై 4న విశాఖ రైల్వే జోన్ పైన టీడీపీ ఆందోళన చేస్తుందని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+