అమ్మ దీవెన: బెజవాడ వసతులపై బాబు ఆరా
విజయవాడ: విజయవాడలో ఉన్న వసతులపై, భవనాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారంనాడు పరిశీలించారు. విజయవాడలోనూ పరిసరాల్లోనూ ఉన్న భవనాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బందరు రోడ్డులోని పర్యాచక భవనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.
విజయవాడలో ఉన్న భవనాలపై, రోడ్లపై ఆయన ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా కొన్ని కార్యాలయాలనైనా హైదరాబాదు నుంచి విజయవాడకు తరలించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. దీంతో ఆయన విజయవాడ వసతులపై సమీక్ష చేశారు.

ఇదిలావుంటే, ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని ఆయన సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మ దీవెనలుంటే అంతా మంచే జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వర్షాలు పుష్కలంగా పడాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అమ్మవారి గుడిని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అవసరమని, రాష్ట్రంలో పేదరికం పోవాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications