బాబు స్వయంకృత అపరాధాలే ఓటమికి కారణం .. ఏపీలో జగన్ దే విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావు
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . చంద్రబాబు స్వయంకృత అపరాదాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని, ఏపీలో విజయ బావుటా ఎగురవేసేది వైసీపీనే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు .

స్వయంకృత అపరాధాలే చంద్రబాబు ఓటమికి కారణం అన్న బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు
ఒకపక్క ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతుంటే నేతలు మాత్రం ఎన్నికల ఫలితాలను తేల్చి పారేస్తున్నారు. ఇక ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు మురళీధర రావు . చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని స్పష్టం చేశారు. చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని స్పష్టం చేశారు.

ఏపీలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేఖత జగన్ కు కలిసొచ్చింది .. ఏపీలో విజయం వైసీపీదే అన్న బీజేపీ జాతీయ నేత
ఏపీ ప్రజలు చంద్రబాబు ను తిరస్కరించారని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేఖత జగన్ కు బాగా కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏపీ ప్రజలను అన్ని విధాలుగా మోసగించారని ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు మురళీధర్ రావు . ఇప్పటికే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేశారని చెప్పారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని మురళీధర్ రావు స్పష్టం చేశారు.

దేశంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే అధికారం అని జోస్యం చెప్పిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే బీజేపీ బలోపేతం అయ్యేందుకు మరింత సమయం పడుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారంటూ జోస్యం చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరిగిందన్న ఆయన ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవని మురళీధర్ రావు స్పష్టం చేశారుఈసారి కూడా మోడీ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా మోదీ పేరు మారుమోగుతుందని పేర్కొన్నారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications