హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై చంద్రబాబు సరికొత్త వ్యూహం?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి తనకు అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణలో బలోపేతమవడానికి అవకాశం దొరకడంతో తాజాగా ఆయన తెలంగాణపై దృష్టిసారించారు.

 చంద్రబాబుకు ఆయుధాన్ని అందించిన కేసీఆర్?

చంద్రబాబుకు ఆయుధాన్ని అందించిన కేసీఆర్?

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో బీసీల అండతో తెలుగుదేశం పార్టీ ఏపీకన్నా తెలంగాణలోనే బలంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటుతోపాటు ప్రత్యర్థి పార్టీలు ఆంధ్రా పార్టీగా ముద్ర వేయడంతో కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్లడం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయుధమైంది. తెలంగాణను తీసేసి భారత్ అని పేరు మార్చడంవల్ల అదే ఆయుధాన్ని కేసీఆర్ తిరిగి చంద్రబాబుకు అందజేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీఆర్ఎస్ ఏర్పాటుతో మారిన సమీకరణాలు!

బీఆర్ఎస్ ఏర్పాటుతో మారిన సమీకరణాలు!

భారత్ రాష్ట్ర సమితి పేరుతోకేసీఆర్ ఆంధ్రాలోకి అడుగు పెడుతుండగా చంద్రబాబు తెలంగాణలో బలోపేతంపై దృష్టిసారించారు. ఇటీవలే గోదావరికి వరదలు వచ్చిన సమయంలో ఆయన పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించారు. భద్రాద్రి జిల్లాలో అక్కడి నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. అంతేకాకుండా బహిరంగసభ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి సెప్టెంబరులోనే ఈ సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నప్పటికీ అక్టోబరుకి వాయిదా వేశారు. అయితే ఈలోగా బీఆర్ఎస్ ఏర్పాటుతో రాజకీయ సమీకరణాలు మారడంతో తెలుగుదేశం పార్టీ వ్యూహం కూడా మారింది.

 ఎన్ని సీట్లొస్తే అంత కింగ్ మేకర్!

ఎన్ని సీట్లొస్తే అంత కింగ్ మేకర్!


భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ, జనసేన, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం, ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైటీపీ, బీఎస్పీ తరఫున ప్రవీణ్ కుమార్ జోరుగా తిరుగుతుండటంతో ఈ రెండు పార్టీలకు కొంత ఓటుబ్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. జనసేన కూడా పోటీచేయబోతోంది. తెలంగాణ అసెంబ్లీకి హంగ్ ఫలితాలు వస్తాయని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నిసీట్లు సాధిస్తే అంత కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉండటంతో బాబు తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. దీనికి అనుగుణంగానే నాయకత్వ మార్పులు కూడా చోటుచేసుకుంటాయంటున్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలన్నీ మార్చేయబోతున్న ఘనత మాత్రం కేసీఆర్ దే.

English summary
Political analysts predict that by removing Telangana and changing its name to Bharat, KCR has handed the same weapon back to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X